తెలంగాణ

telangana

Dalitha Bandhu: దళితులందరికీ దళిత బంధు: కలెక్టర్​

By

Published : Aug 29, 2021, 4:06 AM IST

Updated : Aug 29, 2021, 5:55 AM IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం దళితులందరికీ అందుతుందని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైన దళిత బంధు సర్వేను పరిశీలించారు.

Dalitha Bandhu
దళిత బంధు

హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండో రోజు దళిత బంధు సర్వేను కొనసాగింది. దళిత బంధు సర్వేను కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ పరిశీలించారు. దళిత బంధు పథకం దళితులందరికీ అందుతుందని స్పష్టం చేశారు. హుజూరాబాద్ అర్బన్​లోని 15 వార్డు ఎస్​డబ్ల్యూ కాలనీ, గాంధీనగర్ 29వ వార్డు, ఇందిరా నగర్ కాలనీ, ఎస్సీ కాలనీలోని దళిత కుటుంబాలను స్వయంగా కలిసి వారితో ముచ్చటించారు. కుటుంబంలోని సభ్యుల్ని పలకరిస్తూ వారి ఆర్థిక జీవన స్థితిగతుల్నిఅడిగి తెలుసుకున్నారు.

వారు ఎంపిక చేసుకున్న యూనిట్ల గురించి అడిగారు. దళిత బంధు ద్వారా అందే 10 లక్షల రూపాయలతో లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే సంఖ్యతో పాటు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్లు విధిగా నమోదు చేయాలని, సమగ్ర వివరాలను తీసుకోవాలని సర్వే బృందం అధికారులను ఆదేశించారు. దళిత బంధుతో ఆర్థికంగా ఎదిగి ధనవంతులు కావాలని, దళిత కుటుంబాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామపంచాయతీలో బేడ బుడగ జంగాల కాలనీ( ఎస్సీ), అంబేడ్కర్​నగర్, కొత్తపల్లి గ్రామం ఎరుకల కాలనీలోని దళిత కుటుంబాలను కలిసి మాట్లాడారు. ఎరుకల కాలనీ లోని శనిగరపు ఐలయ్య ఇంట్లో చాపపై కూర్చుని వారు ఎంపిక చేసుకున్న యూనిట్ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

ఇదీ చదవండి: Kabul Attack: కాబుల్ దాడికి ఆర్​డీఎక్స్- పాకిస్థాన్ నుంచే!

Last Updated :Aug 29, 2021, 5:55 AM IST

ABOUT THE AUTHOR

...view details