తెలంగాణ

telangana

Telangana BJP New Chief 2023 : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్​ రెడ్డికి పగ్గాలు..?

By

Published : Jul 1, 2023, 9:09 AM IST

Kishan Reddy Telangana BJP New Chief : ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని.. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. నేతల మధ్య ఎలాంటి అంసతృప్తి లేకుండా చర్యలు చేపడుతోంది. పలువురు రాష్ట్ర అధ్యక్షులను మార్చి.. కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. గతానికి భిన్నంగా ఒకరికి ఒకే పదవి అనే అంశంపై బీజేపీ అధినాయకత్వం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా బండి సంజయ్‌ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

Telangana BJP New Chief 2023
Telangana BJP New Chief 2023

తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు.. రాష్ట్ర అధ్యక్షుడిగా అతడేనా?

Kishan Reddy Telangana BJP New President :రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులకు జాతీయ నాయకత్వం శ్రీకారం చుడుతున్నట్లుతెలిసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్థానంలో త్వరలో కేంద్రమంత్రి, సీనియర్‌ నేత కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించనుందని విశ్వసనీయంగా తెలిసింది. సంజయ్‌కి కేంద్రమంత్రివర్గం లేదా పార్టీ జాతీయ నాయకత్వంలో అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. మూడు నాలుగు రోజుల్లో అన్నిఅంశాలపై స్పష్టత వస్తుందని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.

Kishan Reddy Telangana BJP New Chief :ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సినవ్యూహంపై బీజేపీ అగ్రనాయకత్వం మూడు నాలుగు రోజులు కీలక కసరత్తు చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అగ్రనేత బీఎల్ సంతోశ్​లు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. నేతల మధ్య విభేదాలు బండి సంజయ్‌ మూడేళ్ల పదవీకాలం పూర్తికావడం వంటివి చర్చకొచ్చినట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యా కిషన్‌రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడం సరైన చర్యగా భావించినట్లు తెలుస్తోంది.

Telangana BJP New President Kishan Reddy : రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించిన సంజయ్‌కి సముచిత ప్రాధాన్యం కల్పించాలని.. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. బండి నేతృత్వంలో వివిధ ఉప ఎన్నికలను ఎదుర్కోవడం కీలకమైన హుజూరాబాద్, దుబ్బాక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జీహెచ్​ఎంసీలో 48 స్థానాల్లో గెలుపువంటి అంశాల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి అవకాశం లేకుండా మార్పు చేయాలని.. అగ్రనాయకత్వం నిర్ణయించిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించడం లేదంటే.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక బాధ్యత అప్పగించడంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

Kishan Reddy Telangana BJP New President : బీఆర్​ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కొంతకాలంగా అసంతృప్తితో.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కేంద్ర జాతీయ నాయకత్వంలో సంజయ్‌కు అవకాశం కల్పిస్తే.. సంజయ్‌ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుల్లో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Telangana BJP New Chief Selection 2023 :తాజా పరిణామాలపై బండి సంజయ్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. అంతలోనే కొత్త పరిణామాలు, ఉద్దేశపూర్వకంగా లీక్‌లు ఇస్తుండటంపై సన్నిహితుల వద్ద సంజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తే కార్యకర్తగానే ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తానని చెప్పనట్లు సమాచారం. ఇటీవలే బీజేపీ ముఖ్యనేత బీఎల్ సంతోశ్, ఇతర నేతలు బండి సంజయ్‌తో చర్చించినట్లు సమాచారం. పార్టీ జాతీయ నాయకత్వం త్వరలోనే దిల్లీకి రాష్ట్ర ముఖ్యనేతలను పిలిచి పదవుల మార్పు, ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తుందని తెలిసింది.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకరికి ఒకే పదవి అనే అంశంపై.. పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి చోట రాష్ట్ర అధ్యక్షులకు ప్రొటోకాల్‌ పరంగా ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్రమంత్రి పదవితో పాటు.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి పదవుల్లో ఉన్నవారిని కొనసాగిస్తూనే.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంపై దృష్టి సారించిందని తెలిసింది. అందులో భాగంగా కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రెండు పదవుల్లోనూ కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details