ETV Bharat / state

Y Category Security For Etela Rajendar : ఈటలకు 'వై' కేటగిరీ భద్రత.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Jun 30, 2023, 8:40 PM IST

Updated : Jun 30, 2023, 10:08 PM IST

Etala Rajender
Etala Rajender

20:34 June 30

Y Category Security For Etala Rajender : ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం

Y Category Security For Etela Rajendar : భద్రతా కారణాల దృష్యా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు ఈటల భద్రతపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈటల రాజేందర్​ను హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆయన భార్య జమున ఇటీవల ఆరోపించారు. అంతేకాకుండా ఈటల సైతం తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈటల రాజేందర్ తనకు సోదరుడి లాంటి వాడని, ఆయనకు ప్రాణహాని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్​కు సైతం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈటల రాజేందర్​కు ప్రాణహాని విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని మేడ్చల్ డీసీపీ సందీప్ రావును డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. సందీప్ రావు నిన్న ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి ఆయనను.. పలు విషయాలను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆయన నివాసం చుట్టుపక్కల ప్రాంతాలను సైతం డీసీపీ సందీప్ పరిశీలించారు. ఆ తర్వాత డీజీపీకి నివేదిక అందించారు.

Etala Rajender Supari For Murder Rs 20 Crore : నివేదిక ఆధారంగా ఈటల రాజేందర్​కు భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు అంగరక్షకులు ఎప్పుడు ఈటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు అంతర్గత భద్రత సిబ్బందిలో షిఫ్ట్​కు ఇద్దరు చొప్పున.. మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. దీనితో ఈటల ప్రాణాలకు హాని ఉందని తెలిసే.. ఇలా భద్రతను ఏర్పాటు చేశారని హుజురాబాద్​ శ్రేణులు భావిస్తున్నారు.

అసలేం జరిగింది : ఈటల రాజేందర్​ను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి రూ.20 కోట్లతో సుఫారీ హత్యకు ఫ్లాన్​ చేస్తున్నారని ఈటల సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు భర్తకు, కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని.. తమకు ఏమైనా అయితే సీఎం కేసీఆర్​నే పూర్తి బాధ్యత వహించాలని ఆమె ధ్వజమెత్తారు. రాజేందర్​ను చంపేస్తామంటే ఎవరూ ఇక్కడ భయపడరని.. తాము నయీం బెదిరింపులకే భయపడలేదని చెప్పారు. తనకు నాలుగైదు నెలలు నుంచి బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని చెప్పారు. తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమయ్యింది. తనకు వై కేటగిరి భద్రతను కల్పించాలని భావించింది. ఈలోపు మంత్రి కేటీఆర్​నే చొరవ తీసుకొని.. డీజీపీతో విచారణ జరిపించి.. వై కేటగిరి భద్రతను కల్పిస్తూ.. నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 30, 2023, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.