ETV Bharat / state

Security to MLA Etela : ఈటలకు కేంద్రం వై కేటగిరీ భద్రత!

author img

By

Published : Jun 28, 2023, 10:57 AM IST

Updated : Jun 28, 2023, 11:23 AM IST

Y Category Security to MLA Etela : ఈటల రాజేందర్​ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈటల కూడా తనను జాగ్రత్తగా ఉండాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్​కు వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు సమాచారం.

Etela Rajender
Etela Rajender

Y Category Security to Etela Rajender : బీజేపీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను హతమార్చేందుకు కౌశిక్ రెడ్డి రూ.20 కోట్ల సుపారీ ఇచ్చినట్లు తమకు తెలిసిందని జమున ఆరోపించారు. ఇదే విషయంపై ఈటల రాజేందర్​ కూడా స్పందించారు. నాలుగైదు నెలల నుంచి తనకు జాగ్రత్తగా ఉండాలని బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని.. తాను నయీంకే భయపడలేదని ఇప్పుడు ఈ బెదిరింపు కాల్స్​కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది.

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్​కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం, ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ భద్రత కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వారం రోజుల్లో పూర్తి హక్కులు, స్వేచ్ఛతో కూడిన రాష్ట్ర ప్రచార కమిటీ ఛైరన్​ పదవిని జాతీయ నాయకత్వం ఈటల రాజేందర్​కు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.

  • MLC Kaushik reddy fires on Eetala : 'ఈటలవి హత్యా రాజకీయాలు.. ఓటమి భయంతో నిరాధారమైన వ్యాఖ్యలు'

అసలేం జరిగిదంటే : ఈటల రాజేందర్​ను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆయన​ సతీమణి ఈటల జమున మంగవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్​ను కౌశిక్​ రెడ్డి రూ.20 కోట్లు ఇచ్చి చంపేస్తామని అన్నారని.. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్​ హస్తం ఉందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఈటలను చంపేస్తామంటే ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని లేదని ఈటల జమున వ్యాఖ్యానించారు.

Etela On MLC Kaushik Reddy : మరోవైపు ఇదే విషయంపై ఈటల రాజేందర్​ కూడా స్పందించారు. ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ వేసిన స్కెచ్​​ వల్లే హుజురాబాద్​ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నాని ఈటల దుయ్యబట్టారు. కౌశిక్​ రెడ్డి హుజురాబాద్​లో అరాచకాలు సృష్టించడానికే ఉన్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే నాలుగైదు నెలల నుంచి తనకు జాగ్రత్తగా ఉండాలని బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని చెప్పారు. తనను చంపడానికి నయీం రెక్కీ నిర్వహించాడని, అతనికే తాను భయపడలేదని.. ఇప్పుడు తనను హత్య చేసేందుకు రూ.20 కోట్ల సుపారీ ఇచ్చామని బెదిరిస్తే భయపడిపోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Etela Rajender Latest News : ఈ క్రమంలోనే తనది పార్టీలు మారే సంస్కృతి కాదని.. భారతీయ జనతా పార్టీలోనే ఉంటానని రాజేందర్‌ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని.. పార్టీల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజమని వివరించారు. అధిష్ఠానం పిలిస్తేనే దిల్లీకి వెళ్లానని.. ఎలాంటి పదవీ అడగలేదని తెలిపారు. రాష్ట్రంలో సర్వేలకందని ఫలితాలు వస్తాయని.. బీజేపీ జెండాయే ఎగురుతుందని ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2023, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.