ETV Bharat / state

Etala Security issue : ఈటలతో మేడ్చల్​ డీసీపీ భేటీ.. భద్రతపై ఆరా..

author img

By

Published : Jun 29, 2023, 4:04 PM IST

Etala
Etala

Medchal DCP visit Etala : హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా శామీర్​పేటలోని ఈటల నివాసానికి మేడ్చల్​ డీసీపీ సందీప్​రావు వెళ్లారు. ఈటల రాజేందర్‌తో సమావేశమైన డీసీపీ.. భద్రత అంశాలపై మాట్లాడారు.

Medchal DCP visit Etala : ఈటల రాజేందర్​కు ప్రాణహాని ఉందని.. ​హత్యకు కుట పన్నుతున్నారంటూ ఈటల రాజేందర్​ భార్య జమున చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్​ ఆదేశాల మేరకు.. మేడ్చల్​ డీసీపీ సందీప్​రావు ఈటలను కలిశారు.

ఈ రోజు ఉదయం భద్రత అంశంపై ఈటల స్వగృహంలో.. డీసీపీ సందీప్​రావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన హత్యకు కుట్ర జరుగుతోందనీ.. తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే ఈటల రాజేందర్ తెలపడం జరిగింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత కల్పిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఈటల రాజేందర్ మేడ్చల్​ డీసీపీతో చర్చించిన అనంతరం.. నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థని అడిగి తెలుసుకోమని సూచించారు.. కరీంనగర్ సీపీ దగ్గర సమగ్ర సమాచారం తెలుసుకోమని తెలిపారు. అక్కడి సమాచారం మీద ఆధారపడి భద్రతపై నిర్ణయాలు తీసుకోమని పేర్కొన్నారు. నిజ నిజాలను తెలుసుకున్న తర్వాతే భద్రతపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Y కేటగిరీ భద్రతకు కేంద్రం నిర్ణయం: మరోవైపు ఈటల రాజేందర్​కు కేంద్ర ప్రభుత్వం Y కేటగిరీ భద్రత కల్పించాలనే యోచనలో ఉంది. బీజేపీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను హతమార్చేందుకు కౌశిక్ రెడ్డి రూ.20 కోట్ల సుపారీ ఇచ్చినట్లు తమకు తెలిసిందని జమున ఆరోపించారు.

ఇదే విషయంపై ఈటల రాజేందర్​ కూడా స్పందించారు. నాలుగైదు నెలల నుంచి తనకు జాగ్రత్తగా ఉండాలని బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని.. తాను నయీంకే భయపడలేదని ఇప్పుడు ఈ బెదిరింపు కాల్స్​కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్​కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదంతా పెద్ద జోక్: ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నాననడం పెద్ద జోక్ అని ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటల దంపతులు చెప్పినవన్నీ అబద్ధాలేనని.. తనపై ఆరోపణలపై హుజురాబాద్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. తనను హత్య చేసే ఉద్దేశంతోనే.. ముందే బట్టకాల్చి మీదేస్తున్నారన్నారు. హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేందరేనని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్ 2018లో తనను చంపేందుకు కూడా కుట్ర చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

ఇవీ చదవండి:

Etela Comments on Kaushik Reddy : 'మాపై చేసే వేధింపులకు సీఎం ప్రోద్భలం ఉంది'

Etala Jamuna Slams MLC Kaushik Reddy : 'ఈటల రాజేందర్​ను రూ.20 కోట్లతో చంపేందుకు కౌశిక్​ రెడ్డి ఫ్లాన్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.