ETV Bharat / opinion

విదేశీ విద్య కోసం సప్తసముద్రాలు దాటివెళ్తున్న యువత - కానీ విద్యార్థుల్లో కొత్త భయాలు - Challenges in foreign education

author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 12:36 PM IST

Prathidhwani on Foreign Education Challenges : విదేశీ విద్య కోసం యువత సప్తసముద్రాలు దాటివెళ్తున్నారు. లైఫ్ సెటిలవుతుందని అప్పులు చేసి మరి విమానం ఎక్కుతున్నారు. కానీ అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దీంతో కొత్తగా వెళ్లాలనుకునే విద్యార్థులు అయోమయంలో ఉన్నారు? అసలు విదేశీ విద్యకు ఉన్న అవకాశాలేంటి? సవాళ్లేంటి? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని

Challenges in Study at Abroad
Challenges in Study at Abroad (Etv Bharat)

Prathidhwani on Challenges in Study at Abroad : విదేశీ విద్య యువత కల. దానికోసం సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్ , ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ వంటి సుదూర తీరాలకు చేరుతుంటారు. రెండేళ్లు కష్టపడితే ఎంఎస్‌ చేస్తే చాలు ఏదో మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటారు. అందుకే అప్పులు చేసి మరీ అమెరికా విమానం ఎక్కుతూంటారు. కానీ, అంతర్జాతీయ పరిస్థితులు మారాయి. గతంతో పోలిస్తే విదేశాల్లో ఉద్యోగావకాశాలు తగ్గాయి.

ఇంటర్న్‌షిప్‌లు కూడా దొరకటం కష్టంగా మారింది. మరోపక్క వీసా చిక్కులు ఉండనే ఉన్నాయి. దీంతో కొంతమంది విద్యార్థులు స్వదేశీ బాట పడుతున్నారు. కొత్తగా వెళ్లాలనుకునే విద్యార్థులు అయోమయంలో ఉన్నారు? మరోవైపు విదేశీవిద్యకు కొత్త గమ్యస్థానంగా ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమెటిక్స్‌కు డిమాండ్‌. యూరప్‌లో సెటిలవాలనుకుంటే ఎలాంటి కోర్సు చదవాలి? అసలు విదేశీ విద్యకు ఉన్న అవకాశాలేంటి? ఏఏ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి? సన్నద్ధత ఎలా? సవాళ్లేంటి? ఇదే నేటి ప్రతిధ్వని.

Job Opportunities Decreased in Abroad : మరోవైపు కొన్నిదేశాలు ఇప్పటికే ఇదే పంథాను కొనసాగిస్తూ కీలకమైన వీసాలపై నిబంధనలను కఠినతరం చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతిష్టంభనలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని నిపుణలు అంచనా వేస్తున్నారు. లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. అయితే, అంతా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు ఒకే దేశం నుంచి వెళ్తుండటం ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున స్థిర పడుతుంటడం కూడా ఆ దేశంలోని స్థానికులను కాస్త ఇబ్బందికి గురి చేసే పరిణామమే. గతంలో స్థిరపడిన వారయితే ఎలాగోలా నెట్టుకురావచ్చు. కానీ, కొత్తగా విదేశాల బాట పట్టేవారు ప్రత్యామ్నాయ దేశాలవైపు మెుగ్గు చూపాలని కోరుతున్నారు. అదే విధంగా స్వదేశంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాతైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విదేశీ విద్య విషయంలో పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హితవు పలుకుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.