తెలంగాణ

telangana

IT Raids in Hyderabad : బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు

By

Published : Jun 16, 2023, 10:29 AM IST

IT Raids Continues Third Day in Hyderabd : రాష్ట్రంలో ఇద్దరు బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల నివాసాల్లో మూడోరోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే మరికొందరు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి.

IT Raids
IT Raids

IT Raids at BRS MLAs in Telangana : రాష్ట్రంలో మూడో రోజూ ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్​లోని వైష్ణవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థ, హోటల్‌ ఎట్‌ హోమ్‌, వాటి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

IT raids at BRS MLAs House on Third Day : మరోవైపు బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలోనూ మూడో రోజూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలు సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లలో... సోదాలు జరుపుతున్నారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. అలాగే గడిచిన రెండు ఆర్ధిక సంవత్సరాల వ్యాపార, ఆర్ధిక లావాదేవీలను పరిశీలన చేస్తున్నారు. నగరంలో జరుగుతున్న ఈ సోదాల్లో సుమారు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.

ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఆందోళనలో కార్యకర్తలు : ఇదిలా ఉంటే అదాయపు పన్ను శాఖ సోదాలు ఎప్పటికి ముగుస్తాయో స్పష్టత లేకపోవడంతో... బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బీజేపీ వేధింపుల్లో భాగంగానే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు-36లో నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి, కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డిల ఇళ్లలో ఒక్కో ఇంట్లో రెండు నుంచి మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైష్ణవి గ్రూపు స్థిరాస్థి సంస్థ, హోటల్‌ అట్‌ హోం పేరుతో నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలు, చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉండడంతో రికార్డులు పరిశీలించాలని నిర్ణయించినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

ఆ వివరాలను పరిశీలిస్తున్న ఐటీ బృందాలు : పెద్ద సంఖ్యలో వ్యాపార సంస్థలు ఉండడం, కొన్ని సంస్థలు బినామీల పేర్లపై కూడా ఉన్నాయని ఐటీ శాఖ భావిస్తోంది. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్లు ఇళ్లల్లో కార్యాలయాలల్లో సోదాలు చేయాల్సి ఉండడంతో.... భారీ ఎత్తున ఐటీ బృందాలను రంగంలోకి దించాల్సి వచ్చిందని సమాచారం. బుధవారం ఉదయం ఏకకాలంలో మొదలైన ఐటీ దాడులు ఇవాళ మూడో రోజూ కూడా కొనసాగుతున్నాయి. బుధవారం నుంచి కొనసాగుతున్న ఈ సోదాల్లో ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలను ఐటీ బృందాలు పరిశీలిస్తున్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details