ETV Bharat / state

IT Rides At Two BRS MLAs Houses : రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. బీఆర్​ఎస్ కార్యకర్తల ఆందోళన

author img

By

Published : Jun 15, 2023, 10:15 PM IST

BRS MLAs
BRS MLAs

Income Tax Department Conduct Rides On BRS Leaders : ఇద్దరు బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లల్లోనూ, సంస్థల్లోనూ ఐటీ బృందాల సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ సోదాల్లో 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. ఐటీ సోదాలకు నిరసనగా బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.

IT Rides The House Of Two BRS MLAs In Hyderabad : అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కలిగిన రెండు సంస్థలు, వాటి అనుబంధ సంస్థలతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లల్లో రెండో రోజు కూడా ఆదాయపు పన్నుశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు కూడా రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సోదాలల్లో దాదాపు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. ఐటీ సోదాలు ఎప్పటికి ముగుస్తాయో స్పష్టత లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేస్తున్నారు.

బీఆర్​ఎస్​ నాయకులను బీజేపీ వేదింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36లో నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి, కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇళ్లల్లో ఒక్కో ఇంట్లో రెండు నుంచి మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైష్ణవి గ్రూపు స్థిరాస్తి సంస్థ పేరున, హోటల్‌ అట్‌ హోం పేరు నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలకు, వీరు చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉండడంతో రికార్డులు పరిశీలించాలని నిర్ణయించినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

IT Rides In Hyderabad : అయితే ఈ రెండు సంస్థల్లో భాగస్వామ్యం కలిగిన ప్రజాప్రతినిధులు మరిన్ని వ్యాపారసంస్థల్లో పెట్టుబడి పెట్టడంతో.. ఇక్కడ వచ్చే ఆదాయాన్ని అక్కడ పెట్టుబడి పెట్టారన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రికార్డులు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో వ్యాపార సంస్థలు ఉండడం, కొన్ని సంస్థలు బినామీల పేర్లపై కూడా ఉండడంతో ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్లు ఇళ్లల్లోనూ, కార్యాలయాలల్లో సోదాలు చేయాల్సి ఉండడంతో.. భారీ ఎత్తున ఐటీ బృందాలను రంగంలోకి దించాల్సి వచ్చిందని సమాచారం.

IT Searches in the institutions of BRS MLAs నిన్న ఉదయం ఏకకాలంలో మొదలైన ఐటీ దాడులు ఇవాళ రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కొనసాగుతున్న ఈ సోదాల్లో ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలను ఐటీ బృందాలు పరిశీలిస్తున్నాయి. గత ఆర్థిక ఏడాది, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఈ సంస్థలు నిర్వహించిన వ్యాపారం, వచ్చిన ఆదాయం.. ఆయా సంస్థలు చెల్లిస్తున్న ఆదాయపు పన్ను తదితర వాటిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.