ETV Bharat / spiritual

ఆ రాశి వారి టైమ్ బాగోలేదు- స్టాక్స్​లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 4:10 AM IST

Horoscope Today May 15th 2024 : మే​ 15న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today May 15th 2024 : మే​ 15న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోడానికి కొత్త మార్గాలు వెదుకుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటే విజయం మీదే! సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. దైవబలం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రోజంతా తీరిక లేని పనులతో ఖాళీ ఉండదు. విజయ సిద్ధి ఉంది. మీ ప్రతిభ పని తీరుపై అధికారులు గుర్తించి ప్రోత్సహిస్తారు. ఆర్ధిక లాభాలుంటాయి. వ్యాపారులు వ్యాపార అవసరాల కోసం రుణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయమే మీదే! శ్రీరాముని ఆలయ సందర్శనం ఉత్తమం.

.

మిథునం (Gemini) : మిధున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుద్ధి బలంతో పని చేసి విజయాన్ని సాధిస్తారు. మీ ప్రతిభకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఉండేవారికి శుభకరంగా ఉంటుంది. మీరు ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. శివారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. ఇంటా బయటా, ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరిస్తే మేలు. మీ లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురుకావచ్చు. పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం, సమర్థత మీ విజయానికి బాటలు వేస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. మీరు ఎంత శ్రమిస్తే అంతగా విజయం, ధనలాభం ఉంటాయి. నిస్వార్ధంతో మీరు చేసే పనులు సంఘంలో మీకు గొప్ప పేరును తీసుకు వస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఉద్యోగస్తులకు స్వస్థాన ప్రాప్తి ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. మనోధైర్యంతో పనిచేసి విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి. శివారాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి ఉంటుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు అందుకుంటారు దైవదర్శనం కోసం తీర్ధయాత్రలు చేస్తారు. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి ఈ రోజు అద్భుతాలు చేస్తాయి. ఒక శుభవార్త మంచి శక్తిని ఇస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు వీడండి. హనుమాన్ చాలీసా పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి గొప్ప శుభ సమయం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. పలు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగస్తులకు స్దాన చలనం, జీతం పెరుగుదల ఉంటాయి. నవగ్రహ ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి లాభాలను అందుకుంటారు. సేవా రంగంలో పని చేసే వారికి విశేష ప్రయోజనాలు ఉంటాయి. జీతాలు పెరుగుతాయి. పదోన్నతులు వస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం సందర్శన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. షేర్ మార్కెట్లు రంగం వారికి స్పెకులేషన్లు నష్టాలను తెస్తాయి. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు మంచి రోజు. ఉద్యోగస్తులకు పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక నష్టం సూచితం. కార్యజయం కోసం ఆదిత్య హృదయం పఠించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.