తెలంగాణ

telangana

Corning Material Sciences Investments in Telangana : తెలంగాణలో మరో అగ్రగామి సంస్థ పెట్టుబడులు

By Telangana

Published : Sep 1, 2023, 7:51 PM IST

Corning Material Sciences Investments in Telangana : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ సంస్థలు తరలివస్తున్నాయి. ఇప్పటికే వివిధ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించగా.. తాజాగా మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ రాష్ట్రానికి రానుంది. దేశంలో తొలిసారిగా.. స్మార్ట్‌ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్‌ తయారీకి ప్లాంట్‌ ఏర్పాటునకు ముందుకొచ్చింది.

ktr america tour updates
Corning Material Sciences Investments in Telangana

Corning Material Sciences Investments in Telangana : తెలంగాణకు విదేశీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. తాజాగా మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ రాబోతోంది. భారతదేశంలో మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ తయారు చేసే ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుంది. అమెరికా పర్యటనలో భాగంగా కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బేన్, గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రవికుమార్, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ సారా కార్ట్‌మెల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Minister KTR America Tour Updates : కొనసాగుతోన్న కేటీఆర్ పెట్టుబడుల వేట.. సమావేశాలు, ఒప్పందాలతో మంత్రి ఫుల్​ బిజీ

Minister KTR America Tour Updates : దేశంలో.. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కార్నింగ్ సంస్థ నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. సుమారు రూ.934 కోట్ల పెట్టుబడి వెచ్చించి కార్నింగ్‌ సంస్థ స్థాపించనున్న స్మార్ట్‌ఫోన్ల గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ ద్వారా 800 మందికి ఉపాధి కల్పిస్తుందని ప్రకటించారు. అయితే.. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మక పెట్టుబడి అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 'తెలంగాణలోకి వస్తున్నాను.. కార్నింగ్ ఇన్ తెలంగాణ' అంటూ ట్యాగ్‌ చేసి ట్విటర్‌ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.

Coca Cola Investments in Telangana : మరో భారీ పెట్టుబడి.. తెలంగాణలో పెట్టుబడులను రెట్టింపు చేసిన కోకాకోలా..

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కార్నింగ్ సంస్థ నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుమారు రూ.934 కోట్ల పెట్టుబడి వెచ్చించి కార్నింగ్‌ సంస్థ స్థాపించనున్న స్మార్ట్‌ఫోన్ల గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ ద్వారా 800 మందికి ఉపాధి కల్పిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మక పెట్టుబడి.-కేటీఆర్ ట్వీట్

విజయవంతంగా కొనసాగుతున్న కేటీఆర్ పర్యటన..: అమెరికాలో మంత్రి కేటీఆర్​ పెట్టుబడుల వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మంత్రి తాజా పర్యటనతో కోకాకోలా కంపెనీ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించగా.. మార్స్‌ గ్రూప్‌ సంస్థ మరో రూ.800 కోట్లతో సంస్థను విస్తరించనున్నట్లు తెలిపింది. వీటితో పాటు గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ సంస్థ-జీహెచ్​ఎక్స్.. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అంతర్జాతీయ బ్యాంకింగ్​, ఫైనాన్స్​ దిగ్గజ సంస్థ గోల్డ్​మెన్​ సాచ్​(Goldman Sachs Company) తెలంగాణలో తన భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. హైదరాబాద్​ నగరంలో గోల్డ్​మెన్​ సాచ్​ సంస్థ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఆ సంస్థ ప్రకటించిన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా.. ప్రస్తుతం 1000 మంది ఉన్న చోట రెండు రెట్లు పెంచి 2000 మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Mars Group Investments in Telangana : మరో భారీ పెట్టుబడి.. రూ.800 కోట్లతో సంస్థను విస్తరించనున్నట్లు ప్రకటించిన మార్స్ గ్రూప్

Minister KTR America Tour Update : హైదరాబాద్​లో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేయనున్న మెట్ లైఫ్​ సంస్థ

ABOUT THE AUTHOR

...view details