ETV Bharat / state

KTR Tweet On Foxconn : రాష్ట్రంలో ఫాక్స్​కాన్​ మరో 400 మిలియన్​ డాలర్ల పెట్టుబడి.. కేటీఆర్​ ట్వీట్​

author img

By

Published : Aug 12, 2023, 5:48 PM IST

KTR Tweet On Foxconn : తెలంగాణలో ఫాక్స్​కాన్​ 550 మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టడంపై మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు. మొదట కుదుర్చుకున్న 150 మిలియన్​ డాలర్లకు.. ఇప్పుడు మరో 400 మిలియన్​ డాలర్లను ఫాక్స్​కాన్​ జోడించింది. ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్​(ప్రస్తుతం ఎక్స్​) వేదికగా వెల్లడించారు.

Foxconn Invested 550 Million Dollars In Telangana
KTR Tweet On Foxconn

KTR Tweet On Foxconn : గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి మరొక 400మిలియన్ డాలర్లు జోడిస్తూ మొత్తం 550 మిలియన్​ డాలర్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఫాక్స్​కాన్​తో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్నేహాన్ని గురించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్​ చేశారు. ఫాక్స్‌కాన్(Foxconn) గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్​(ప్రస్తుతం ఎక్స్​) వేదికగా వెల్లడించారు.

ఇరువురు పరస్పర కట్టుబాట్లను అందజేస్తూ ఉంటారని స్పష్టం చేశారు. గతంలో ఉన్న 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో సహా ఇప్పుడు మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణలోకి ఫాక్స్​కాన్ సంస్థ అడుగుపెడుతోందని మంత్రి కేటీఆర్ ఎక్స్(Twitter)​లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్​కాన్ సంస్థ సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

  • Our friendship with Foxconn Group remains steadfast, each of us delivering on mutual commitments

    With total infusement of $550m (adding previous $150m), FIT is poised to deliver on its promises in Telangana

    This once again proves Telangana Speed pic.twitter.com/DOssnhmyRo

    — KTR (@KTRBRS) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉంటుంది. ఇరువురు పరస్పర కట్టుబాట్లను అందజేస్తూ ఉంటాం. గతంలో ఉన్న 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో సహా ఇప్పుడు మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణలోకి ఫాక్స్​కాన్ సంస్థ అడుగుపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్​కాన్ సంస్థ సిద్ధంగా ఉంది." - మంత్రి కేటీఆర్​, ట్వీట్​

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. లక్ష మందికి ఉపాధి..

Foxconn Industry At Kongarkalan In Telangana : ఈ ఏడాది మార్చి నెలలో ఎలక్ట్రానిక్స్​ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫాక్స్​కాన్​ పరిశ్రమకు రంగారెడ్డి జిల్లా కొంగర్​కలాన్​లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ భూమి పూజ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల దాదాపు 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించారు. ఇలానే ఉంటే మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఆ రాష్ట్రం నుంచి 'ఫాక్స్​కాన్' ఔట్! ఏ ప్రభావం ఉండదన్న మంత్రి.. కాంగ్రెస్ ఫైర్!

Foxconn Industry In Telangana : ఈ ఏడాది మార్చి3న హోన్​ హై ఫాక్స్​ కాన్​(Hon Hai Fox Conn) ప్రతినిధులతో సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.. ఫాక్స్​కాన్​ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఫాక్స్​కాన్​ సంస్థ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమయింది. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయి.

KTR tweet on Foxconn plant : తెలంగాణ స్పీడ్.. ఫాక్స్​కాన్ ప్లాంట్ నిర్మాణ పనులపై కేటీఆర్ ట్వీట్

Foxconn Industry in Telangana : 'ఫాక్స్​కాన్​తో 35 వేల మందికి ఉపాధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.