Foxconn Industry in Telangana : 'ఫాక్స్‌కాన్‌తో 35 వేల మందికి ఉపాధి'
Published: May 15, 2023, 11:20 AM


Foxconn Industry in Telangana : 'ఫాక్స్‌కాన్‌తో 35 వేల మందికి ఉపాధి'
Published: May 15, 2023, 11:20 AM

Foxconn Industry Investments in Telangana : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో ఇవాళ ఫాక్స్‌కాన్ పరిశ్రమకు భూమిపూజ చేశారు.
Foxconn Industry in Telangana : రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో ఫాక్స్‌కాన్ పరిశ్రమకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ పాల్గొన్నారు.
KTR laid Foundation For Foxconn Industry in Telangana : ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏడాదిలోగా పూర్తి కావాలని కోరుకుంటున్నాని మంత్రి కేటీఆర్ ఆకాక్షించారు. ఈ సంస్థకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. 9 ఏళ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని వివరించారు. ఐటీ రంగంలో దేశంలోని ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తెలంగాణకే దక్కిందని అన్నారు. ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని.. పరిశ్రమ పూర్తయ్యాక తొలి విడతలో 25,000 ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు.
Foxconn Industry at Kongar kalan : 196 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీలో యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించారు. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
"ఫాక్స్‌కాన్ కంపెనీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశాం. ఫాక్స్‌కాన్ కంపెనీలో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 9 ఏళ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
