తెలంగాణ

telangana

మిరపకాయలతో డీహెచ్​ శ్రీనివాసరావు హోమం... ఇంతకీ ఆయనేమన్నారంటే?

By

Published : Apr 6, 2022, 7:34 PM IST

Updated : Apr 6, 2022, 7:49 PM IST

Dh Srinivasrao Strange worship: ప్రజా వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు చేసిన పూజలు వివాదస్పదమయ్యాయి. ఆయన మిరపకాయలతో చేసిన హోమంపై సోషల్ మీడియాలో వీడియో వైరలయ్యాయి. దీంతో పూజలపై ఆయన స్పందించారు.

Dh Srinivasrao
Dh Srinivasrao

మిరపకాయలతో డీహెచ్​ శ్రీనివాసరావు హోమం... ఇంతకీ ఆయనేమన్నారంటే?

Dh Srinivasrao Strange worship: ప్రజా వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు విచిత్రమైన హోమ కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనాపురం పంచాయతీ జిమ్నా తండాలో మంగళవారం రాత్రి తెరాస ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన హోమంలో డీహెచ్ పాల్గొన్నారు. రాత్రి సమయంలో నిర్వహించిన ప్రత్యేక హోమ పూజల్లో డీహెచ్... తలపాగా ధరించి, హోమం చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు. తెరాస ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మి ప్రతి మంగళవారం తన ఇంటి ఆవరణలోనే గిరిజన సంప్రదాయానికి చెందిన వివిధ రకాల పూజలు నిర్వహిస్తుండటం ఆనవాయితీ.

ఇందులో భాగంగా ఈనెల 24న పాల్వంచలో తన ట్రస్టు పేరిట మెగా వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించిన డీహెచ్ శ్రీనివాసరావు... మంగళవారం సన్నాహక ఏర్పాట్ల కోసం కొత్తగూడెం వచ్చారు. ఇందులో భాగంగా ఎంపీపీ విజయలక్ష్మి ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి హోమంలో పాల్గొన్నారు. అయితే... ఈ హోమం కార్యక్రమం మిరపకాయలతో నిర్వహించడం, ఆ వీడియోలు వైరల్​గా మారడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నిర్వహకులు ఈ హోమ పూజలపై వివరణ ఇచ్చారు. కులదేవతను పూజిస్తూ... గిరిజన సంప్రదాయంలో సాగే హోమంగా పేర్కొంటున్నారు.

డీహెచ్ స్పందన:తాను ఎలాంటి క్షుద్ర పూజల్లో పాల్గొన లేదని డీహెచ్ శ్రీనివాస రావు వివరణ ఇచ్చారు. విచిత్ర హోమంలో పాల్గొన్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న తనపై కొందరు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యంగిరాదేవి పూజలో పాల్గొంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. స్థానికులు గిరిజన పూజ ఉందన్న ఆహ్వానంతో కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​లో పూజలో పాల్గొనట్టు వివరించారు.

తనకు స్వయం ప్రకటిత దేవతతో ఎలాంటి సంబంధం లేదని డీహెచ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారంటూ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆయన... రాష్ట్రానికి ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్న తనకి రాజకీయాలతో అవసరం ఏముందన్నారు. తన తండ్రి పేరున ఏర్పాటు చేసిన జీఎస్​ఆర్ ట్రస్ట్ పనులపై తరచు స్వస్థలానికి వెళ్లి వస్తున్నట్టు వివరించారు. ప్రజలు, మీడియా ప్రతినిధులు నిజాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

'ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాను. స్థానికుల ఆహ్వానం మేరకు వెళ్లి పూజల్లో పాల్గొన్నా. అమ్మవారి హోమ పూజలో స్థానికులతో కలిసి పాల్గొన్నాను. స్వయంప్రకటిత దేవతతో నాకు సంబంధం లేదు. మూఢనమ్మకాలను విశ్వసించను. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. జరిగినవి క్షుద్రపూజలు కాదు.. వ్యక్తి పూజలు కాదు. శాస్త్రాన్ని నమ్మే వ్యక్తిని.. ఆచరించే వ్యక్తిని.' -- శ్రీనివాసరావు, డీహెచ్‌

ఇదీ చూడండి:

Last Updated : Apr 6, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details