తెలంగాణ

telangana

'హిట్​ మ్యాన్'కు తోడుగా మరో క్రికెటర్​.. ఐపీఎల్​లో 14 సార్లు డకౌట్​

By

Published : May 6, 2022, 10:39 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అత్యధికసార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు ముంబయి సారథి రోహిత్​ శర్మ. మొత్తం 14 సార్లు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు హిట్​ మ్యాన్​. ఇప్పుడీ జాబితాలో మరో క్రికెటర్​ చేరాడు.

Mandeep Singh equals Rohit Sharma's record of most ducks in IPL history
Mandeep Singh equals Rohit Sharma's record of most ducks in IPL history

Mandeep Singh Equals Rohit: ఐపీఎల్​లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు మన్​దీప్​ సింగ్​. అత్యధికసార్లు డకౌటైన క్రికెటర్ల జాబితాలో.. ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ సరసన నిలిచాడు. ఈ ఇరువురూ.. ఇండియన్​ టీ-20 లీగ్​లో 14 సార్లు పరుగులేమ చేయకుండానే వెనుదిరిగారు. వీరే తొలిస్థానంలో ఉన్నారు. మే 5న సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో భువనేశ్వర్​ కుమార్​ వేసిన తొలి ఓవర్లోనే డకౌట్​ అయ్యాడు మన్​దీప్​. ఈ జాబితాలో రహానె, పార్థివ్‌ పటేల్‌, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్‌, పీయుష్‌ చావ్లా 13 సార్లు డకౌటయ్యారు.

గురువారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్​రైజర్స్​ 186/8 పరుగులు చేసింది. పూరన్(62) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్​రైజర్స్​.. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్ (92; 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడగా.. రోమన్‌ పొవెల్ (67; 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. దిల్లీ మిగతా బ్యాటర్లలో రిషభ్ పంత్ (26) పరుగులు చేయగా.. మిచెల్‌ మార్ష్‌ (10), మన్‌దీప్‌ సింగ్ (0) డకౌట్‌ అయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, సీన్‌ అబాట్, శ్రేయాస్‌ గోపాల్ తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details