తెలంగాణ

telangana

10 వేల మంది ఆకలి తీరుస్తున్న గంగూలీ

By

Published : Apr 5, 2020, 10:30 AM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ. కోల్​కతాలోని ఇస్కాన్​ ట్రస్టుతో కలిసి పది వేల మంది అన్నార్తులకు ఆహారాన్ని అందించనున్నాడు.

BCCI president Sourav Ganguly will starve 10,000 people
అన్నార్తుల ఆకలి తీర్చటానికి 'దాదా' సాయం

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందిపడుతున్న పేదలకు సాయం చేసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ముందుకొచ్చాడు. ఇస్కాన్‌ (కోల్‌కతా)తో కలిసి తన ట్రస్టు ద్వారా అతడు రోజుకు 10 వేల మంది కడుపు నింపనున్నాడు. ఇప్పటికే రోజుకు 10 వేల మంది ఆకలి తీరుస్తున్న ఈ సంస్థకు తాజాగా సౌరభ్‌ వితరణతో మరో పది వేల మందికి అన్నం పెట్టే అవకాశం లభించింది.

"కోల్‌కతా ఇస్కాన్‌ తరఫున ప్రతిరోజూ 10 వేల మంది అన్నార్తుల కోసం భోజనాలు సిద్ధం చేస్తాం. మా ప్రియతమ గంగూలీ ముందుకొచ్చి విరాళం ఇవ్వడం వల్ల మరో 10 వేల మందికి అన్నం పెట్టే అవకాశం దక్కింది" అని ఇస్కాన్‌ పేర్కొంది. గంగూలీ ఇంతకుముందు కరోనా బాధితుల కోసం రూ.50 లక్షల విలువైన బియ్యాన్ని సాయంగా అందించాడు.

ఇదీ చూడండి.. కరోనాపై పోరుకు ఇంగ్లాండ్ క్రికెటర్ల భారీ విరాళం

ABOUT THE AUTHOR

...view details