తెలంగాణ

telangana

రానాకు అది వదులుకోలేని అలవాటు..!

By

Published : Oct 31, 2021, 9:39 AM IST

Updated : Oct 31, 2021, 1:12 PM IST

దక్షిణాదితో పాటు హిందీలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా(rana daggubati movies).. తన జీవితం గురించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రామ్​చరణ్​తో(ram charan movies) స్నేహం, నాగచైతన్యపై ఉన్న ఈర్ష్య తదితర విషయాల్ని చెప్పారు.

actor rana life facts in telugu
రానా

భళ్లాలదేవుడిగా 'బాహుబలి'లో(bahubali film) విశ్వరూపం చూపించిన రానా(rana daggubati movies) ఆ తరువాత కూడా వైవిధ్యమైన పాత్రల్నే ఎంచుకుంటూ, వివిధ భాషల్లో నటిస్తూ... తనకంటూ స్టార్‌డమ్‌ సృష్టించుకున్నారు. త్వరలో విరాటపర్వం, భీమ్లానాయక్‌లతో(bheemla nayak release date) అలరించనున్న రానా తన ఇష్టాయిష్టాలూ మనసులోని ముచ్చట్లను పంచుకుంటున్నారిలా..

కలవనిచ్చేవారు కాదు

చాలామంది స్నేహితులు ఉన్నా కానీ... స్కూల్లో చదువుతున్నప్పటినుంచీ ఇప్పటివరకూ రామ్‌చరణే(ram charan and rana school photos) నా బెస్ట్‌ ఫ్రెండ్‌. అవును, చిన్నప్పటినుంచీ మేమిద్దరం కలిసే చదువుకున్నాం. మా అల్లరి పనుల్ని భరించలేక ఇంట్లోవాళ్లు మమ్మల్ని కలవనివ్వకుండా విశ్వప్రయత్నాలు చేసేవారు కానీ వాళ్లవల్ల అయ్యేది కాదు. మా స్కూల్లో ఉపాసన, అల్లు స్నేహ కూడా చదువుకున్నారు. ఉపాసన(upasana kamineni net worth) నాకు జూనియర్‌ అయితే స్నేహ నా క్లాస్‌మేట్‌.

రామ్​చరణ్

అన్నీ తినేసేవాడిని

వీఎఫ్‌ఎక్స్‌లో పనిచేస్తున్నప్పుడు నా ఫిజిక్‌ను అస్సలు పట్టించుకునేవాడిని కాదు. ఏది పడితే అది తినేసేవాడిని. వ్యాయామం అసలు ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానో అప్పటినుంచీ నా అలవాట్లన్నీ పూర్తిగా మార్చుకున్నా. డైటింగ్‌, వ్యాయామాలు.. నా జీవితంలో ఓ భాగంగా చేసుకున్నా. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నా.

నటుడు కాకముందు..

సినిమాల్లోకి రాకముందు వీఎఫ్‌ఎక్స్‌ రంగంలో పనిచేశా. 'సైనికుడు'కి పనిచేశాక నంది అవార్డు కూడా వచ్చింది. తరువాత 'లీడర్‌'తో(rana leader movie) నా కెరీర్‌ ప్రారంభించా. అప్పటినుంచీ ప్రతి సినిమానూ కొత్తగానే ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా.

రానా

ఆ అమ్మాయి నచ్చేది

నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయి చేరింది. నాకు సీనియర్‌ అయినా అందరు అబ్బాయిల్లానే నేనూ తనతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడిని. తరువాత కొన్నాళ్లకు ఫేస్‌బుక్‌లో తనకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించా. మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌గా మా స్కూల్‌మేట్స్‌ ఉండటం వల్ల తను కూడా ఒకే చేసింది కానీ ఆ తరువాత కూడా నన్ను గుర్తుపట్టలేకపోయింది. ఇప్పుడు తెలుసుకుని ఉండొచ్చు.

షూటింగ్‌లు లేకపోతే

కుటుంబంతో గడుపుతా. ఆ తరువాత పుస్తకాలు ఎక్కువగా చదువుతా. అన్నింట్లోకీ మహాభారతం అంటే చాలా ఇష్టం.

సాంబార్‌ ఇష్టం

నేను అన్నిరకాల ఆహారపదార్థాలనూ ఇష్టపడినా మా నానమ్మ చేసే సాంబార్‌(sambar recipe) ఉంటే మొదటి ప్రాధాన్యం దానికే. చిన్నప్పుడైతే రోజూ సాంబార్‌ ఉండాలని గొడవచేసేవాడిని.

ఇష్టమైన నటీనటులు

కమల్‌హాసన్‌, శ్రీదేవి. నేను నటించే సినిమాల్లో కమల్‌హాసన్‌ను(kamal haasan movies) అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటా కూడా.

కమల్​హాసన్

వదులుకోలేని అలవాటు

బూట్లు ఎక్కువగా కొనడం. ఎక్కడికి వెళ్లినా నేను షాపింగ్‌చేసే వాటిల్లో మొదట అవే ఉంటాయి.

హీరో కాకపోయి ఉంటే...

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యేవాడిని.

పెళ్లి వీడియోలు పంపాం

కరోనా కారణంగా నా పెళ్లికి(rana daggubati wife) కేవలం 30 మందినే ఆహ్వానించడం వల్ల మిగిలిన బంధువులూ, స్నేహితులకు ఆ వేడుకను వీఆర్‌లో రూపొందించి హెడ్‌సెట్లూ, మిఠాయిలూ, ఇతర కానుకలతో పంపించాం. దాంతో దగ్గరుండి మా పెళ్లి చూస్తున్నంత ఆనందపడ్డారు వాళ్లంతా.

నచ్చే దర్శకులు

మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ(gopal varma movies). వాళ్ల సినిమాలను చూస్తూనే పెరిగా.

చైతన్య ఒక అడుగు ముందే

చైతన్య(naga chaitanya new movie) నా కన్నా చిన్నవాడే కానీ నిదానంగా ఉంటూనే విజయాలనూ సాధిస్తాడు. మొదటినుంచీ అన్నివిషయాల్లో ఒక అడుగు ముందే ఉన్నాడు. చదువు ముందే పూర్తయ్యింది. సినిమాల్లోకీ త్వరగా వచ్చాడు, మా బాబాయితోనూ సినిమా చేశాడు. ఇవన్నీ చూసి నప్పుడు ఆనందంగా అనిపించినా 'వెంకీమామ' చేసిన తరువాత మాత్రం కొద్దిగా ఈర్ష్యగా అనిపించింది.

నాగచైతన్య
Last Updated :Oct 31, 2021, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details