తెలంగాణ

telangana

మహిళా టిక్​టాకర్​ బట్టలు చించి.. నగ్నంగా గాల్లోకి ఎగరేసి..

By

Published : Aug 18, 2021, 1:26 PM IST

Updated : Aug 18, 2021, 4:25 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఓ మహిళా టిక్​టాకర్​పై పాశవికంగా దాడి చేశారు వందల మంది దుండగులు. తనను వివస్త్రను చేసి.. గాల్లోకి ఎగరేసుకుంటూ వెళ్లారని బాధితురాలు ఆరోపించారు. అంతేకాక తన ఫోన్, నగదును లాగేసుకున్నారని తెలిపారు.

pak woman tiktoker
మహిళ

స్వాతంత్య్ర దినోత్సవం రోజే పాకిస్థాన్​లో అమానవీయ సంఘటన జరిగింది. ఓ వీడియో షూట్ చేస్తుండగా.. వందల మంది గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడికి దిగారని మహిళా టిక్​టాకర్ ఆరోపించారు. తనను వివస్త్రను చేసి.. దుస్తులను గాల్లోకి ఎగురేస్తూ తీసుకెళ్లారన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ అడ్డా స్టేషన్ పోలీసులు నిందితులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

వీడియో షూట్ చేస్తుండగా..

ఆగస్టు 14న.. లాహోర్​లోని మినార్​-ఈ -పాకిస్థాన్​ వద్ద మహిళా టిక్​టాకర్ తన గ్రూప్ సభ్యులతో కలిసి వీడియో షూట్ చేశారు. అదే సమయంలో 300-400 మంది గుర్తుతెలియని వ్యక్తులు అక్కడకు వచ్చి.. సదరు మహిళపై దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి.. గాల్లోకి ఎగరేశారు. తనతోపాటు.. గ్రూప్ సభ్యులనూ వేధించారని మహిళ.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన చెవిపోగులు, ఫోన్, రూ. 15వేలు నగదును లాగేసుకున్నారని తెలిపింది.

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఘటనపై పాక్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాహోర్ డీఐజీ సాజిద్​ ఖియానీ స్పందించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. నిందితులను చట్టపరంగా శిక్షిస్తామన్నారు.

ఇదీ చదవండి:రాజకీయాల్లోకి మహిళలా? పగలబడి నవ్విన తాలిబన్లు!

Last Updated :Aug 18, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details