తెలంగాణ

telangana

ఎస్టీపీ పనులను పరిశీలించిన కేటీఆర్... వేగంగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశం

By

Published : Sep 24, 2022, 5:20 PM IST

Updated : Sep 24, 2022, 6:18 PM IST

Minister Ktr Inspecction: హైదరాబాద్‌లో జ‌ల‌మండ‌లి ప‌నులు చేప‌ట్టే ప్రదేశాల్లో.. భ‌ద్రతా చ‌ర్యల‌ను ప‌ర్యవేక్షించేందుకుగానూ రూపొందించిన సేఫ్టీ ప్రోటోకాల్ వాహ‌నాల‌ను నానక్‌రాంగూడ‌లో మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

minister ktr
మంత్రి కేటీఆర్​

Minister Ktr Inspecction: హైదరాబాద్ ఫ‌తేన‌గ‌ర్‌లో జ‌ల‌మండ‌లి నిర్మిస్తున్న ఎస్టీపీ ప‌నుల‌ను మంత్రి కేటీఆర్ ప‌రిశీలించారు. న‌గ‌రంలో జ‌ల‌మండ‌లి ప‌నులు చేప‌ట్టే ప్రదేశాల్లో భ‌ద్రతా చ‌ర్యల‌ను ప‌ర్యవేక్షించేందుకు గానూ రూపొందించిన సేఫ్టీ ప్రోటోకాల్ వాహ‌నాల‌ను నానక్‌రాంగూడ‌లో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

నగరంలో జలమండలి చేపట్టే వివిధ పనులు జరిగే ప్రదేశాల్లో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. జలమండలి చేపట్టే పైప్ లైన్‌ విస్తరణ, సీవరేజ్ పనులు, లీకేజీల నివారణ పనులు, మ్యాన్ హోల్ మ‌రమ్మతులు, ఇలా ప్రతి పని ప్రదేశంలో భద్రతా చర్యలు కచ్చితంగా పాటించేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

న‌గ‌రంలో 100 శాతం మురుగునీటి శుద్ధి ల‌క్ష్యంగా జ‌ల‌మండ‌లి చేప‌ట్టిన 31 ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నారు. గ్రేట‌ర్​లో మూడు ప్యాకేజీల కింద‌ నిత్యం 1257.50 ఎమ్మెల్డీల మురుగు నీరు శుద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాల‌ను జ‌ల‌మండ‌లి నిర్మిస్తోంది. 2036 వ‌ర‌కు ఇబ్బంది లేకుండా, 9.84 ల‌క్షల జ‌నాభాకు సరిప‌డా దీనిని నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 24, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details