దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. ఆన్​లైన్ చైల్డ్​​ పోర్నోగ్రఫీ ముఠాలే లక్ష్యం!

author img

By

Published : Sep 24, 2022, 3:11 PM IST

cbi child abuse

దేశవ్యాప్తంగా 56 ప్రాంతాల్లో.. చిన్నారులను లైంగికంగా వేధించే సమాచారాన్ని ఆన్​లైన్​లో వ్యాప్తి చేస్తున్న ముఠాలే లక్ష్యంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. 'ఆపరేషన్‌ మెఘా చక్ర' పేరుతో దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

CBI Raids Today : చిన్నారులను లైంగికంగా వేధించే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వ్యాప్తిచేస్తున్న ముఠాలే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. 'ఆపరేషన్‌ మెఘా చక్ర' పేరుతో 19 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం సహా 56 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసే సమాచారాన్ని ప్రసారం చేయడం, మైనర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తులే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది

సింగపూర్‌ నుంచి అందిన సమాచారం, అలాగే గత ఏడాది కార్బన్‌ పేరిట నిర్వహించిన ఆపరేషన్‌ నుంచి పొందిన ఇంటెలిజెన్స్ డేటా అధారంగా తాజా సోదాలు జరిగుతున్నాయి. ఈ సమాచార ప్రసారానికి ముఠాలు ఉపయోగించే క్లౌడ్ స్టోరేజ్ లక్ష్యంగా ఆపరేషన్ కార్బన్ జరిగింది. దానికి అనుబంధంగా తాజాగా ఆపరేషన్‌ను చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పోర్నోగ్రఫీ కేసుల్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ గతవారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజా దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చదవండి: 'భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర'.. 'PFIని బ్యాన్ చేయండి

పాటలు పాడుతూ పాఠశాల శుభ్రం.. విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.