'భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర'.. 'PFIని బ్యాన్ చేయండి'

author img

By

Published : Sep 24, 2022, 12:54 PM IST

Updated : Sep 24, 2022, 1:28 PM IST

pfi nia report

దేశవ్యాప్తంగా జరిగిన పీఎఫ్​ఐకి చెందిన స్థలాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది.

PFI Report: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు రిమాండ్ రిపోర్టును రూపొందించింది.

స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నట్లు తెలిపింది. నేతల ఆదేశాలతో పని చేస్తున్న పీఎఫ్​ఐ సభ్యులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో యువతను తప్పుదోవపట్టించిందని వివరించింది. యువతను లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. ఇందులో భాగంగా ఈ సంస్థ.. భారతదేశంలో ఇస్లామిక్​ పాలనను స్థాపించడానికి కుట్ర పన్నిందని నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈ సంస్థపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్.. కేంద్రాన్ని కోరింది. పీఎఫ్ఐకి సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది.

సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు (10), అసోం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి, దిల్లీ (3) రాజస్థాన్ (2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.

పుణెలో నిరసన జ్వాలలు.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుల అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తున్న 60 మందిని అదుపులోకి తీసుకున్నారు పుణె పోలీసులు. నిరసనలు చేపట్టొద్దని ఆందోళనకారులను హెచ్చరించినా వారు ఆదేశాలు పాటించలేదని తెలిపారు.

ఇదీ చదవండి : కూటములు మార్చుతూ నీతీశ్​ ప్రధాని కాగలరా? 2025లో బిహార్​ మాదే!'

మాజీ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట.. అవినీతి కేసు విచారణపై స్టే

Last Updated :Sep 24, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.