ETV Bharat / snippets

'మంత్రి ఉత్తమ్‌ చెప్పినవన్నీ ఉత్త మాటలే - రేపు వాస్తవాలు వెల్లడిస్తా'

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 8:19 PM IST

BJP MLA Maheswarreddy on Minister Uttam
BJP MLA Maheswarreddy on Minister Uttam (ETV Bharat)

BJP MLA Maheswarreddy on Minister Uttam : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాటలన్నీ ఉత్త మాటలేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. సివిల్‌ సప్లయ్‌ శాఖలో అవకతవకలు జరిగాయన్నది , వందల కోట్ల స్కాం జరిగిందన్నది వాస్తమేనని పునరుద్ఘాటించారు. ఆధారాలతో సహా తాను ప్రశ్నించిన 19 అంశాలకు సమాధానం చెప్పలేక మంత్రి దాటవేయడంతోనే ఆయన డొల్లతనం బయటపడిందని అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం విడుదల చేసి వెల్లడిస్తానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.