తెలంగాణ

telangana

ఆ కాలనీలో ప్రతి ఇంటి ముందు నీలిరంగు సీసా.. ఎందుకంటే?

By

Published : Nov 29, 2021, 7:12 PM IST

అది హరియాణా పానీపత్​లో ఓ కాలనీ. బయటవారెవరైనా ఆ కాలనీలోకి అడుగు పెడితే ఆశ్చర్య పోకుండా ఉండలేరు. ఎందుకంటే.. ఆ కాలనీలో ప్రతి ఇంటి ముందు(Blue bottle hanging at homes) ఓ నీలం రంగు సీసా వేలాడుతూ ఉంటుంది. అసలింతకీ ఆ నీలి రంగు సీసా కట్టడం వెనుక కారణమేంటి?

Panipat neel Bottle Dogs
ఆ కాలనీలో ప్రతి ఇంటి ముందు నీలిమందు సీసా.. ఎందుకంటే?

కాలనీలోని ప్రతి ఇంటి ముందు నీలిమందు సీసా

ఇంటికి దిష్టిబొమ్మలు వేలాడదీయడం గురించి మనకు తెలుసు. కానీ, ఇంటి ముందు నీలం డబ్బాను వేలాడదీయడం ఎప్పుడైనా చూశారా? హరియాణా పానీపత్​లోని(Haryana panipat blue bottle) మోడల్​ టౌన్ కాలనీలోకి వెళితే ఈ వింతను మనం చూడొచ్చు. ఈ కాలనీలోని ఒకటి కాదు.. రెండు కాదు ప్రతి ఇంటి ముందు ఓ నీలం రంగు డబ్బా(Blue bottle hanging at homes) వేలాడుతూ ఉంటుంది. అయితే.. ఈ కాలనీవాసులంతా ఇలా ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఈ ప్రశ్నలకు మోడల్​టౌన్​ కాలనీ వాసులు చెప్పే సమాధానం వింటే... ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.

ఇంటి ముందు నీలం రంగు సీసా

ఇంతకీ వాళ్లు ఏం చెబుతారంటే..?

ఈ కాలనీలో ఒకప్పుడు కుక్కల బెడద చాలా ఉండేది. ఇళ్లలోకి శునకాలు వచ్చి కరవడం.. ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం వంటివి చేసేవి. శునకాలు చేసే బీభత్సంతో విసిగిపోయిన కాలనీ వాసులు ఈ నీలి సీసా పరిష్కారాన్ని(Blue bottle dogs) కనిపెట్టారు. ఇంటి ముందు ఇలా నీలి రంగు సీసాను వేలాడదీస్తే కుక్కలు రావని నమ్మడం మొదలుపెట్టారు. ఈ కాలనీలో తొలుత ఒకరు ప్రారంభించిన ఈ పద్ధతిని ఇరుగుపొరుగు వారు తెలుసుకుని వాళ్లు కూడా అనుసరించడం మొదలు పెట్టారు. ఇప్పుడు అది క్రమంగా దాదాపు ఈ కాలనీ అంతటికీ పాకింది.

ఇంటి ముందు గేటుకు వేలాడదీసీన నీలం రంగు సీసా
కాలనీలో కుక్కలు

తెలిసినా..

తమకు ఇది మూఢవిశ్వాసం అని తెలిసినా దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కోణం ఉండవచ్చన్న కారణంతో ఈ పద్ధతిని అనుసరిస్తున్నామంటున్నారు పలువురు కాలనీవాసులు.

"మా కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. రోడ్డు మీద వెళ్లే వారిని కరుస్తాయి. వీటి వల్ల ఇళ్ల ముందు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. దీనికి పరిష్కారం కోసం చూస్తుంటే ఓ రోజు మా పక్కింటి వారి ఇంటి ముందు నీలి మందు సీసా ఉండటం చూశాను. ఇది ఏంటని వారిని అడిగితే కుక్కల బెడద పోగొట్టేందుకు పంజాబ్​లోని తమ గ్రామంలో ఇలాగే చేస్తారు అని చెప్పారు. ఇది మూఢ నమ్మకమని తెలిసినా దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కోణం ఉండొచ్చని అనుసరించాను. కానీ దీని వల్ల ఎలాంటి పరిష్కారం లేదు.

-శశి అగర్వాల్, కాలనీ వాసి

ఈ వింత పద్ధతిని అనుసరిస్తున్న వారిలో చాలామంది విద్యావంతులు కూడా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి :నగరంలో 'చిరుత' ఫోబియా.. కుక్కను చూసినా భయంతో..

ABOUT THE AUTHOR

...view details