తెలంగాణ

telangana

'మహా'లో  తగ్గిన కేసులు- కొత్తగా 48,700 మందికి కరోనా

By

Published : Apr 26, 2021, 9:34 PM IST

Updated : Apr 26, 2021, 9:59 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపించింది. కొత్తగా 48,700 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి మరో 524 మంది మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 33,574 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

corona
మహారాష్ట్ర కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​ కల్లోలం కొనసాగుతున్నప్పటికీ.. మహారాష్ట్రలో రోజువారీ కేసుల్లో సోమవారం కాస్త తగ్గుదల కనిపించింది. కొత్తగా 48,700 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి మరో 524 మంది మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే 3,876 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనాతో మరో 70 మంది మరణించారు. పుణే​ జిల్లాలో కొత్తగా 6,046 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. కరోనా ప్రభావానికి మరో 151 మంది మరణించారు.

మిగతా రాష్ట్రాల్లో కేసులు ఇలా..

  • ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 33,574 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ ధాటికి మరో 249 మంది మరణించారు.
  • గుజరాత్​లో కరోనా కోరలు చాస్తోంది. సోమవారం ఒక్కరోజే 14,340 కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 158 మంది బలయ్యారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 16,438 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. కొవిడ్​తో మరో 84 మంది మరణించారు.
  • తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 15,684 మంది వైరస్​ బారిన పడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కేరళలో కరోనా పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే 21,890కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 28మంది బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 29,744 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 201 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బంగాల్​లో కొత్తగా 15,992 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్​ కారణంగా 68 మంది మరణించారు. దీంతో బంగాల్​లో మొత్తం కేసుల సంఖ్య 7,59, 942కి చేరింది.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 12,686 మంది వైరస్​ బారిన పడ్డారు. వైరస్​తో మరో 88 మంది మరణించారు.
Last Updated :Apr 26, 2021, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details