తెలంగాణ

telangana

దేశంలో కొవిడ్ భయాలు.. 'మహా' ఎమ్మెల్యేల్లో సగం మందికి జలుబు, దగ్గు

By

Published : Dec 22, 2022, 2:28 PM IST

దేశాన్ని కొత్త కొవిడ్ వేరియంట్ కేసులు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర శాసనసభలో దాదాపు సగానికిపైగా ఎమ్మెల్యేలు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వీరందరికీ శాసనసభ ప్రాంగణంలోనే పరీక్షలు నిర్వహించారు వైద్యులు.

maharashtra mlas cold
కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో చలిపులి పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో శాసనసభ శీతాకాల సమావేశాలకు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మరికొందరు జ్వరం, బీపీ, మధుమేహం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. విధాన్ భవన్ పరిధిలో మూడు రోజుల్లో దాదాపు 611 మందికి వైద్యులు పరీక్షించగా ఈ విషయం తెలిసింది.

దేశంలో కొత్త వేరియంట్ కొవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు జలుబు, దగ్గుతో బాధపడడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడూ నమోదవ్వనంత అల్ప ఉష్ణోగ్రతలు శాసనసభ శీతాకాల జరుగుతున్న నాగ్‌పుర్‌లో నమోదవుతున్నాయి. 13 నుంచి 14 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అలాగే నాగ్​పుర్​ సహా విదర్భలోనూ చలి వణికిస్తోంది. అనేక మంది ఎమ్మెల్యేలు ఈ చలిని తట్టుకోలేకపోతున్నారని శాసనసభ వర్గాలు చెప్పాయి.

ABOUT THE AUTHOR

...view details