తెలంగాణ

telangana

KTR, Harish Rao Telangana Assembly Election Results 2023 Live : కేటీఆర్, హరీశ్​రావు - గెలుపు లాంఛనమే, మెజార్టీ 'చే'జారే

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 1:51 PM IST

Telangana Assembly Election Results 2023 Live Updates : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఎప్పుడూ మెజారిటీ గురించే అంతా చర్చించుకుంటారు. ప్రత్యర్థులు ఎవరైనా మమ్మల్ని ఆపేదెవరు అనే రేంజ్​లో దూసుకుపోతుంటారు ఆ ఇద్దరు నేతలు. తమ రికార్డులను తామే తిరగరాసుకుంటూ ముందుకెళ్తుంటారు. వారే మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు. ఈసారీ వారి గెలుపు లాంఛనమే అయినా మెజారిటీ మాత్రం కాస్త తగ్గింది.

Minister KTR Majority in Sirscilla 2023
Telangana Assembly Election Results 2023 Live Updates

KTR, Harish Rao Telangana Assembly Election Results 2023 Live Updates : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగగానే ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే మొత్తం 119 నియోజకవర్గాల్లో కొన్నింటిని మాత్రం ఆయా అభ్యర్థులు తమ కంచుకోటలుగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల, హరీశ్​రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ అభ్యర్థుల గెలుపు లాంఛనమే. అందరూ మాట్లాడుకునేది కేవలం మెజారిటీ గురించే.

మరీ ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఏదైనా సంచలనం, అనూహ్యం లాంటివి జరిగితే తప్ప కేటీఆర్, హరీశ్​రావుల గెలుపుపై ఇక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండవు. ప్రజలు చర్చించుకునేదల్లా ఈ ఇద్దరూ ఎంత మెజారిటీ సాధిస్తారనే. భారత రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్​) సర్కార్​కు రెండు చక్రాల్లాంటి వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర పోటీ ఉంటుంది. అదే ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందా అని. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Minister KTR Majority in Sirscilla 2023 : సిరిసిల్ల. ఓ కుగ్రామం నుంచి నేడు జిల్లా కేంద్రంగా అవతరించి అభివృద్ధిలో దూసుకుపోతుంది. చేనేత, వస్త్ర ఉత్పత్తులకు ఈ ప్రాంతం నిలయం. మంత్రి కేటీఆర్​ ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగుసార్లు పోటీ (2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018) చేసి ప్రస్తుతం ఐదోసారి బరిలో దిగారు. 2009 ఎన్నికల్లో ప్రత్యర్థి కేకే మహేందర్​ రెడ్డిపై 171 ఓట్ల స్వల్ప వ్యత్యాసంతో కేటీఆర్ నెగ్గారు. ఆ తర్వాత 2010 ఉప ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహేందర్‌ రెడ్డి కేటీఆర్​తో పోరాడుతున్నారు. అయితే తొలి పోరులో స్వల్ప తేడాతో నెగ్గిన కేటీఆర్ 2010లో 68 వేలు, 2014లో 53,004, 2018లో 89,009 ఆధిక్యంతో కేకేపై విజయబావుటా ఎగురవేశారు. ఈసారీ ప్రత్యర్థిగా కేకేనే ఉండటంతో గత ఆధిక్యం కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం గతసారి కంటే ఆధిక్యం బాగా తగ్గిపోవడం గమనార్హం.

Harish Rao Majority in 2023 Elections : ఇక సిద్దిపేట నియోజకవర్గంలోనైతే మంత్రి హరీశ్​రావు దరిదాపుల్లో నిలిచే నేతలు సైతం కనబడటం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 1985 నుంచి సీఎం కేసీఆర్, 2004 ఉప ఎన్నికల సమయం నుంచి హరీశ్​రావు వరుసగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం బీఆర్​ఎస్​ పార్టీకి కంచుకోటగా మారింది. ఇక్కడ ఇప్పటికే మూడు ఉప ఎన్నికలతో కలిపి డబుల్​ హ్యాట్రిక్​ కొట్టిన మంత్రి ఏడోసారి విజయం కోసం బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ (118699)తో గెలుపొందారు.

మంత్రి హరీశ్​రావుకు ప్రత్యర్థులుగా ఈసారి కాంగ్రెస్​ తరఫున పూజల హరికృష్ణ, బీజేపీ అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​ రెడ్డి బరిలో నిలిచారు. గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో వీరిద్దరూ కృషి చేయగా, మరోసారి రికార్డు మెజారిటీపై మంత్రి హరీశ్‌రావు దృష్టి సారించారు. అయితే మంత్రి కోరుకున్నట్లుగా ఈసారి భారీ మెజారిటీ సాధ్యం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ గాలి వీచిన తరుణంలో ఆయనకు గతంలో కంటే ఈసారి తక్కువ మెజారిటీ వచ్చింది.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details