తెలంగాణ

telangana

కేరళలో భారీగా పెరిగిన కరోనా కేసులు

By

Published : Oct 20, 2021, 8:42 PM IST

Updated : Oct 20, 2021, 9:10 PM IST

కేరళలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొద్ది రోజులుగా 10వేల లోపే నమోదవుతున్న కొత్త కేసులు బుధవారం 11వేల మార్కును దాటాయి. కర్ణాటకలో మరో 462మంది వైరస్​ బారినపడ్డారు.

Kerala logs 11,150 new COVID cases after logging less than 10K infections for few days
కేరళలో భారీగా పెరిగిన కరోనా కేసులు

కొద్ది రోజలుగా కేరళలో స్థిరంగా నమోదవుతున్న కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. చాలా రోజుల తర్వాత 11వేల మార్కును అధిగమించాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 11,150 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 82 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 48,70,584కి చేరగా.. మరణాల సంఖ్య 27,084కి పెరిగింది.

అక్టోబర్​ 14 నుంచి 19 వరకు కేరళలో 10వేల లోపే కరోనా కేసులు నమోదయ్యాయి.

  • కర్ణాటకలో మరో 462మందికి వైరస్ సోకింది. కొత్తగా 9 మంది చనిపోయారు. మరో 749మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 29,84,484కి చేరింది. మృతుల సంఖ్య 37,976గా నమోదైంది.
  • మహారాష్ట్రలో కొత్తగా 1,825 కరోనా కేసులు వెలుగుచుశాయి. మరో 21మంది మరణించారు. 2,879 మంది కోలుకున్నారు.
  • మధ్యప్రదేశ్​లో మరో 9మంది వైరస్ బారినపడ్డారు. కొత్తగా ఎవరూ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పేదు.

ఇదీ చదవండి:వరుణుడి బీభత్సానికి కేరళలో 42మంది మృతి

Last Updated :Oct 20, 2021, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details