తెలంగాణ

telangana

'కొవిడ్‌ టీకా తీసుకుంటే ఆకస్మిక మరణాల ముప్పు తగ్గుతుంది'- ICMR నివేదిక

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 3:49 PM IST

ICMR Report On Covid Vaccine : కనీసం ఒక డోసు కొవిడ్​ వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని ఐసీఎంఆర్(ICMR) అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని అధ్యయనంలో తేలింది.

icmr covid vaccine side effects
icmr covid vaccine side effects

ICMR Report On Covid Vaccine : కొవిడ్‌ వ్యాక్సిన్‌ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ICMR అధ్యయనానికి సంబంధించిన నివేదిక ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది.

యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలను విశ్లేషించేందుకు 2021 అక్టోబర్‌ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య కాలంలో ఐసీఎంఆర్‌ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. దీని కోసం ఆకస్మికంగా మరణించిన 18-45 ఏళ్ల వయసు వ్యక్తుల కేసులను అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 729 కేసులు, 2916 కంట్రోల్‌ కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఈ అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని తెలిపింది.

కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఈ ముప్పు తగ్గుతుందని నివేదికలో పేర్కొంది. ఈ ఆకస్మిక మరణాలకు ధూమపానం, తీవ్ర శ్రమ, మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం వంటి వాటితోపాటు, కొవిడ్‌ చికిత్స తర్వాత జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి కూడా కారణాలు కావొచ్చని తెలిపింది.

'జిమ్​ చేస్తూ కుప్పకూలి ఎందుకు చనిపోతున్నారు?'.. ఆకస్మిక మరణాలపై ICMR స్టడీ
కొద్ది రోజుల క్రితం ఆకస్మిక మరణాలపై ICMR రెండు అధ్యయనాలను చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ రాజీవ్‌ బహల్.. గుజరాత్‌లో జరిగిన ప్రపంచ సంప్రదాయ ఔషధ సదస్సులో తెలిపారు. ICMR.. 50 పోస్టుమార్టం నివేదికలపై అధ్యయనం చేసిందని, మరో 100 నివేదికలను పరిశీలించనున్నట్లు వివరించారు. ఇది కొవిడ్ 19 వ్యాప్తి పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని.. ఇతర మరణాలను నిరోధించే అవకాశం ఉందని వెల్లడించారు. ICMR మొదటి అధ్యయనంలో భాగంగా కొవిడ్‌ తర్వాత ఆకస్మికంగా చనిపోయిన వారి శరీరాల్లో ఏదైనా మార్పులు జరిగాయా అని పరిశీలిస్తోంది. ఆకస్మికంగా గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యాల వల్లే అధిక మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారిస్తున్నట్లు బహల్ తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మరో రెండు కొవిడ్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

Universal Vaccine: అన్ని వేరియంట్లనూ ఎదుర్కొనే సార్వత్రిక టీకా

ABOUT THE AUTHOR

...view details