తెలంగాణ

telangana

Wife Complaint Against Husband : 'ఫ్రెండ్స్​తో సెక్స్​ చేయమని భర్త ఒత్తిడి.. ఆ​ సీక్రెట్స్ షేర్​.. అడిగితే చంపేస్తానంటూ..'

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 7:17 PM IST

Wife Complaint Against Husband : తన స్నేహితులతో సెక్స్​లో పాల్గొనాలంటూ భర్త ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది ఓ మహిళ. వైవాహిక రహస్యాలను కూడా వాళ్లతో చెప్పేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ ఘటన.

Husband forced to have physical relations with his friends: Wife complains in Bengaluru
Husband forced to have physical relations with his friends: Wife complains in Bengaluru

Wife Complaint Against Husband : కర్ణాటకలోని బెంగళూరులో ఓ మహిళ.. తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త బలవంతం చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వైవాహిక రహస్యాల గురించి స్నేహితులతో చర్చిస్తున్నాడని పోలీసులకు చెప్పింది.

మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలికి(42) నిందితుడితో 2007లో వివాహమైంది. వారిద్దరి బంధానికి గుర్తుగా 11ఏళ్ల కుమారుడు, 10ఏళ్ల కుమార్తె ఉన్నారు. బెంగళూరులోని బళ్లారి రోడ్డులో ఓ అపార్ట్​మెంట్​లో వీరి కుటుంబం నివసిస్తోంది. కొన్నిరోజుల క్రితం.. బాధితురాలు తన భర్త మొబైల్​లోని చాట్​లను చూసింది. ఆ సమయంలో అతడు తన స్నేహితులతో వారి వైవాహిక రహస్యాల గురించి చర్చించినట్లు గుర్తించింది. సెక్స్​ వర్కర్ల గురించి కూడా మాట్లాడినట్లు తెలుసుకుంది. ఇదేమిటని ప్రశ్నించగా.. చంపేస్తానని భర్త బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

గత కొన్ని నెలలుగా తన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త బలవంతం చేస్తున్నాడని కూడా బాధితురాలు.. పోలీసులకు చెప్పింది. మహిళ ఫిర్యాదు అందుకున్న బెంగళూరులోని అమృతళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇలాంటి ఘటనే..
కొద్దిరోజుల క్రితం.. బెంగళూరులోనే అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. తన స్నేహితులతో సెక్స్​లో పాల్గొనాలంటూ ఓ మహిళను ఒత్తిడి చేశాడు ఆమె భర్త. తాను చెప్పిన మాట వినకుంటే ఆమెను వివిధ రకాలుగా టార్చర్​ పెట్టాడు. ఎంతోకాలం సహించిన బాధితురాలు.. తట్టుకోలేక భర్తపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఆ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని తనిసంద్రలో నివాసముంటున్న బాధితురాలికి 2011లో జాన్​ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించేవాడు. అంతే కాకుండా భార్యను కొట్టి హింసించేవాడు. 2015లో జాన్​ తన స్నేహితులతో సెక్స్​లో పాల్గొనమని భార్యను బలవంతపెట్టాడు. దానికి నిరాకరించిన భార్యను వివిధ రకాలుగా టార్చర్​ పెట్టాడు. ఆ హింసను భరించలేక ఆమె రెండుమూడు సార్లు జాన్​ స్నేహితులిద్దరితో సెక్స్​లో పాల్గొంది. ఆ సమయంలో మహిళకు తెలియకుండా కొన్ని ఫొటోలను తీసి వాటిని దాచుకుని ఆమెను బ్లాక్​ మెయిల్​ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ క్లిక్​చేయండి.

భర్త మర్మాంగం కోసేసిన భార్య.. బలవంతంగా సెక్స్ చేసేందుకు యత్నించాడట..!

భార్య పోర్న్​ వీడియోలతో ఆనందం.. అదే డబ్బు సంపాదన మార్గం.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details