ETV Bharat / bharat

ఫ్రెండ్స్​తో సెక్స్​లో పాల్గొనమని భర్త ఒత్తిడి.. టార్చర్​ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన భార్య

author img

By

Published : Dec 10, 2022, 3:35 PM IST

husband forced wife to do sex with his friends
husband forced wife to do sex with his friends

తన స్నేహితులతో సెక్స్​లో పాల్గొనాలంటూ ఓ మహిళను ఒత్తిడి చేశాడు ఆమె భర్త. అతడి మాటకు పలుమార్లు వ్యతిరేకించిన ఆమె.. టార్చర్​ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

భార్యను కంటికి రెప్పగా కాపాడే భర్తలను చూస్తుంటాం. కానీ కర్ణాటక.. బెంగళూరులోని ఓ భర్త మాత్రం తన భార్యను అతని స్నేహితులతో శృంగారం చేయమని బలవంతం చేస్తున్నాడు. తాను చెప్పిన మాట వినకుంటే ఆమెను వివిధ రకాలుగా టార్చర్​ పెడుతున్నాడు. ఎంతోకాలం సహించిన బాధితురాలు.. తట్టుకోలేక భర్తపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని తనిసంద్రలో నివాసముంటున్న బాధితురాలికి 2011లో జాన్​ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి విధ్వంసం సృష్టించేవాడు. అంతే కాకుండా భార్యను కొట్టి హింసించేవాడు.

2015లో జాన్​ తన స్నేహితులతో సెక్స్​లో పాల్గొనమని భార్యను బలవంతపెట్టాడు. దానికి నిరాకరించిన భార్యను వివిధ రకాలుగా టార్చర్​ పెట్టాడు. ఆ హింసను భరించలేక ఆమె రెండుమూడు సార్లు జాన్​ స్నేహితులిద్దరితో సెక్స్​లో పాల్గొంది. ఆ సమయంలో మహిళకు తెలియకుండా కొన్ని ఫొటోలను తీసి వాటిని దాచుకుని ఆమెను బ్లాక్​ మెయిల్​ చేయడానికి సిద్ధపడ్డాడు.

ఉద్యోగ రీత్యా 2019లో తమ ఇంట్లో ఉండేందుకు వచ్చిన మహిళ సోదరిపై జాన్​ కన్నేశాడు. ఆమెను కూడా తన ఫ్రెండ్స్​తో సెక్స్​లో పాల్గొనేలా చేయాలంటూ భార్యను ఒత్తిడి చేశాడు. దీనికి నిరాకరించిన మహిళ.. అతనితో విడిపోయేందుకు నిర్ణయించుకుంది. అందుకు ఆగ్రహించిన భర్త.. బాధితురాలి ప్రైవేట్​​ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్​​ చేస్తానని బెదిరించాడు.

దీంతో ఆ ఆలోచన విరమించుకుంది. కానీ అతడి టార్చర్​ తట్టుకోలేక మహిళ మరోసారి డిసంబర్​ 4న విడాకులు​ అడిగింది. దీంతో ఆమె వాట్సాప్​కు రెండు ప్రైవేట్​ ఫొటోలను జాన్​ పంపించాడు. ఆమెకు పంపించినట్లే మిగతా అందరికి పంపిస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.