ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్​ను పెళ్లి చేసుకున్న యువకుడు.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వేద మంత్రాల మధ్య వివాహం

author img

By

Published : Dec 10, 2022, 10:56 AM IST

Updated : Dec 10, 2022, 11:50 AM IST

youth-married-eunuch-bride-in-uttar pradesh
ట్రాన్స్ జెండర్​ను పెళ్లి చేసుకున్న యువకుడు

ఇరవైనాలుగేళ్ల ఓ యువకుడు, ట్రాన్స్​జెండర్​ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనికి అతడి తల్లిదండ్రులు సైతం ఒప్పుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది. అసలేం జరిగిందంటే..

ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై పుడుతుందో తెలియదు. ప్రేమకు వయసు, కులం, మతం, హోదాతో సంబంధం లేదు అనే మాటలు చాలా సార్లు విన్నాం. చాలా రకాల ప్రేమ జంటలు ఈ నానుడిని నిజం చేసి చూపించాయి. ప్రేయసి కోసం ప్రియుడు ఏమైనా చేస్తాడంటారు. అయితే ఇదే రీతిలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకోగా ఇప్పుడు ఇది హాట్​టాపిక్​గా మారింది.

ఉత్తర్​ప్రదేశ్ ఆజంగఢ్​ జిల్లాకు చెందిన వీరూ రాజ్‌భర్‌(24), ఓ ట్రాన్స్ జెండర్​తో ప్రేమలో పడ్డాడు. రెండేళ్లుగా ప్రేమాయణం సాగించిన వీరిద్దరూ శుక్రవారం పెళ్లి పీఠలెక్కారు. జిల్లాలోని భైరోధం ఆలయ ప్రాంగణంలో, హిందూ ఆచారాల ప్రకారం వేద మంత్రాల సాక్షిగా ట్రాన్స్​జెండర్​ను వివాహం చేసుకున్నాడు యువకుడు. బంగాల్‌లోని జల్‌పైగురి నివాసి అయిన ముస్కాన్ కిన్నార్ అనే ట్రాన్స్​ జెండర్​ 2 ఏళ్ల క్రితం బ్రాస్ బ్యాండ్ పార్టీలో నృత్యం చేయడానికి మౌకి వచ్చింది. అక్కడ ముస్కాన్.. మౌలోని టెకై గ్రామానికి చెందిన వీరూ రాజ్‌భర్‌ను కలిసింది. వారి మొదటి మీటింగ్​లోనే ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరూ లివ్​ఇన్ రిలేషన్​ షిప్​లో ఉండేందుకు నిర్ణయించుకుని.. దాదాపు రెండేళ్లుగా కలిసి ఉన్నారు.​ ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. దీనికి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడం వల్ల ఇద్దరూ భైరోధం గుడిలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

youth-married-eunuch-bride-in-uttar pradesh
ట్రాన్స్ జెండర్​ను పెళ్లి చేసుకున్న యువకుడు
youth-married-eunuch-bride-in-uttar pradesh
ట్రాన్స్ జెండర్​ను పెళ్లి చేసుకున్న యువకుడు

వేదమంత్రాల సాక్షిగా.. నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని ఒకరికొకరు ప్రమాణాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరూ మాట్లాడుతూ.. "నేను ఓ ట్రాన్స్ జెండర్​ను వివాహం చేసుకున్నాను. ఇందుకు మా కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం తెలుపలేదు. మా కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ రోజు మా పెళ్లి జరిగింది" అని అతడు చెప్పాడు. మరోవైపు కొత్త పెళ్లికూతురైన ముస్కాన్.. ప్రియుడైన వీరూతో తనకు వివాహం జరగడం వల్ల చాలా ఆనందంగా ఉన్నానని అంటోంది.

youth-married-eunuch-bride-in-uttar pradesh
వివాహం చేసుకుంటున్న ప్రేమజంట
Last Updated :Dec 10, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.