తెలంగాణ

telangana

క్రైమ్​ స్టోరీ రాసేందుకు దొంగతనం చేసిన 'క్రేజీ రైటర్'​.. పోలీసులకు చిక్కి..

By

Published : Jul 6, 2023, 10:33 PM IST

దోపిడీ అంశంతో మంచి క్రైమ్ థ్రిల్లర్​ కథ రాయాలనుకున్నాడు ఓ వ్యక్తి. ఎవరి కథో ఎందుకని.. తానే ఓ దొంగతనం చేసి రాయాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరకు కటకటాల పాలయ్యాడు. అసలేం జరిగిందంటే?

man loot to write crime thiller story
man loot to write crime thiller story

ఉత్తర్​ప్రదేశ్​లోని​ ఫరీదాబాద్​లో విచిత్ర ఘటన జరిగింది. మంచి క్రైమ్ థ్రిల్లర్​ కథ రాసేందుకు ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. ప్రత్యక్ష అనుభవాలతో స్టోరీ రాయాలనుకుని కటకటాల పాలయ్యాడు. సొంత స్టోరీ రాసుకుందామనుకునేలోపు.. అతడి కథను పోలీసులు రాశారు!

ఇదీ జరిగింది..
కృష్ణ.. హత్రస్​ జిల్లాలోని ఫర్సోతి గ్రామానికి చెందిన వ్యక్తి. శైలేంద్ర కుమార్​ గోరఖ్​పుర్​ జిల్లా నివాసి. ఇర్షాద్​ రోహ్​తక్​ ఏక్తా కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఫరీదాబాద్​లోని డబువా పాలి రోడ్డులో ఉన్న ఫ్యాన్​ రెగ్యులేటర్లు తయారు చేసే సంజనా టూల్స్ అనే కంపెనీలో ఏడాది కాలంగా కృష్ణ పనిచేస్తున్నాడు. శైలేంద్ర కుమార్​ ఓ నేరగాడు. పలు కేసుల్లో ఇప్పటికే దాదాపు ఎనిమిదేళ్లు జైలు జీవితం గడిపాడు.

శైలేంద్ర.. స్థానికంగా ఉన్న సంజనా టూల్స్​లో చోరీకి పథకం రచించాడు. ఆ పథకాన్ని అమలు​ చేయడానికి అదే కంపెనీలో పనిచేస్తున్న కృష్ణ, ఇర్షాద్​తో పాటు సౌరభ్​ అనే మరో వ్యక్తి చేయి కలిపాడు. కంపెనీ గురించి అన్ని వివరాలు తెలిసిన కృష్ణ సహాయంతో నలుగురు కలిసి జూన్​ 21న కంపెనీలో దొంగతనం చేశారు. యజమాని కుందన్​లాల్​ను కొట్టి.. కట్టేశారు. అనంతరం రాగి తీగల కట్టలు, 58 వేల నగదు, యాజమాని స్కూటీతో పాటు మరికొన్ని విలువైన వస్తువులతో పరారయ్యారు. సమాచారం అందున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గాలింపు చర్యలు చేపట్టిన ఫరీదాబాద్​ క్రైమ్​ బ్రాంచ్ సెక్టార్​-48​ పోలీసు బృందం.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. సౌరభ్​ మాత్రం తప్పించుకున్నాడు. నిందితుల వద్ద నుంచి 2 రాగి తీగల కట్టలు, రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్​కు తీసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇర్షాద్​కు ఎలాంటి నేర చరిత్ర లేదని.. కథలు రాయడం అతడికి హాబీ అని తెలిసింది. దొంగతనం చేసి తన సొంత అనుభవాలతో కథ రాయాలనుకున్నాడని.. కానీ విధి వికటించి పోలీసులకు చిక్కాడు.

క్రైమ్ బ్రాంచ్​ పోలీసులతో నిందితులు

మంచి దొంగలు.. తిరిగి వారే డబ్బులిచ్చారు!
ఇలాంటి వింత దొంగతనం ఇటీవల దేశ రాజధాని దిల్లీలో జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ జంటను దోచుకునే ఆలోచనతో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. మద్యం మత్తులో తూగుతూ తుపాకీతో బెదిరించి వారిద్దరినీ తనిఖీ చేశారు. ఆ జంట వద్ద కేవలం రూ.20 మాత్రమే ఉండటం చూసి.. మనసు కరిగింది కాబోలు.. పైగా ఆ మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు కూడా రోల్డ్ గోల్డ్​వేనని గుర్తించారు. దీంతో దొంగలే వారికి రూ.100 ఇచ్చి అక్కడినుంచి బైక్​పై వెళ్లిపోయారు. బుధవారం అర్ధరాత్రి వేళ ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details