తెలంగాణ

telangana

సముద్రంలో భారీగా డ్రగ్స్.. 2,500 కిలోలు సీజ్​.. విలువ రూ.12వేల కోట్లు

By

Published : May 13, 2023, 7:36 PM IST

Updated : May 13, 2023, 8:13 PM IST

దేశ పశ్చిమ తీరంలో 2.500 కిలోల డ్రగ్స్​ పట్టుబడ్డాయి. భారత నావికాదళం, ఎన్​సీబీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి భారీ మొత్తంలో డ్రగ్స్​ను సీజ్ చేశాయి. జప్తు చేసిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

దేశ పశ్చిమ తీరంలోని భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ, ఎన్​సీబీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్న 2,500 కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే నౌకలో ఉన్న పాకిస్థాన్​కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

"నేవీతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి 2,500 కిలోల మెథాంఫేటామిన్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇంతమొత్తంలో మెథాంఫెటామిన్ స్వాధీనం చేసుకోవడం దేశంలోనే ఇదే మొదటిసారి. పాకిస్థాన్​కు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. ఓడలో మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. 134 బస్తాల మెథాంఫేటామిన్​ను సీజ్ చేశాం. పాకిస్థాన్, ఇరాన్ మధ్య ఉన్న మక్రాన్ తీరంలో మదర్​షిప్​ అనే పెద్ద నౌక చిన్న చిన్న ఓడల ద్వారా అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తోంది. ఆపరేషన్ సముద్రగుప్తలో భాగంగా నేవీ, ఎన్​సీబీ కలిసి నౌకలో అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలును సీజ్ చేశాం. "
-ఎన్​సీబీ అధికారులు

అధికారులు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలు
అధికారులు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలు

రూ.21 వేల కోట్ల డ్రగ్స్ సీజ్​..
2021 సెప్టెంబరులో గుజరాత్.. ముంద్రా పోర్ట్​లో​ 3వేల కేజీల హెరాయిన్​ పట్టుబడింది. సీజ్​ చేసిన డ్రగ్స్​ విలువ రూ.9వేల కోట్లు ఉంటుందని తొలుత భావించిన అధికారులు.. ఆ తర్వాత దాని విలువ రూ.21వేల కోట్లని తేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు.
ముంద్రా పోర్ట్ ​నుంచి 2,988.21 కేజీల హెరాయిన్​​ ఉన్న రెండు కంటెయినర్లను డైరక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటలిజెన్స్​ (డీఆర్​ఐ) అధికారులు సీజ్​ చేశారు. ఓ కంటెయినర్​లో 1999.57 కేజీలు, రెండో కంటెయినర్​లో 988.64 కేజీలు ఉన్నాయి. నమూనా పరీక్షల్లో అది హెరాయిన్​ అని నిర్ధరణ అయింది. టాల్క్​ స్టోన్​ పేరుతో వీటిని విజయవాడకు చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అంతర్జాతీయ మార్కెట్​లో కిలో హెరాయిన్ ధర రూ.5 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

హెరాయిన్​ను ​అఫ్గానిస్థాన్​ నుంచి ఇరాన్​లోని బందర్​ అబ్బాస్​ పోర్ట్​ మీదుగా గుజరాత్​కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అహ్మదాబాద్​, దిల్లీ, చెన్నై, గాంధీధామ్​, మండవీలో తనిఖీలు చేపట్టగా.. చెన్నైలో ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితులు.. ఆషీ ట్రేడింగ్​ కంపెనీ నిర్వహకులైన ఎం సుధాకర్​, దుర్గా వైశాలి దంపతులుగా అధికారులు గుర్తించారు.

గతేడాది ఆగస్టులో.. మహారాష్ట్రలోని ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు చేసిన అధికారులు.. ఐదుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1400 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :May 13, 2023, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details