తెలంగాణ

telangana

రైల్వే క్రాసింగ్ వద్దే మహిళ ప్రసవం.. అంబులెన్సుకు ఫోన్​ చేసినా..

By

Published : Dec 4, 2021, 11:46 AM IST

Updated : Dec 4, 2021, 1:21 PM IST

Delivery of woman near railway crossing: రోడ్డు మార్గం సరిగా లేక ఓ గర్భిణీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. పురుటినొప్పులతో అల్లాడుతూ ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రసవించింది.

Delivery of woman near railway crossing
Delivery of woman near railway crossing

రైల్వే క్రాసింగ్ వద్దే మహిళ ప్రసవం

Delivery of woman near railway crossing: మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మార్గం సరిగా లేక, అంబులెన్సు రాకపోవడం వల్ల ఓ మహిళ పురిటినొప్పులతో అల్లాడిపోయింది. చివరకు ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రసవించింది. ఈ ఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

మహిళను మోసుకెళ్తున్న కుటుంబ సభ్యుడు

Labour giving birth on road:

పీర్ ఝాలర్ అనే గ్రామానికి చెందిన పూజ.. కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. పురిటినొప్పులు వచ్చేసరికి ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. 100కి డయల్ చేసి అంబులెన్సును పిలవగా.. సిబ్బంది వచ్చేందుకు నిరాకరించారు. రోడ్డు మార్గం సరిగా లేనందున రాలేమని తేల్చి చెప్పారు.

Ujjain latest news:

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మోసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కొద్దిదూరం వెళ్లగానే.. ఓ రైల్వే క్రాసింగ్ సమీపంలో మహిళకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మార్గమధ్యంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడే మహిళ ప్రసవించింది.

రైల్వే క్రాసింగ్ పక్కనే మహిళ ప్రసవం

వ్యానులో తరలింపు

అనంతరం రైల్వే క్రాసింగ్ పక్కనే ఉన్న ఓ ప్రాంతానికి మహిళను తీసుకెళ్లారు. ఓ వ్యానులో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. శిశువుకు ప్రస్తుతం ఆస్పత్రి ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వైద్యులు తెలిపారు.

మహిళను వ్యానులోకి ఎక్కిస్తున్న కుటుంబ సభ్యులు

తేలికపాటి వర్షాలకే

మరోవైపు, గ్రామానికి ఇప్పటివరకు పక్కారోడ్డు లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డు.. రెండు రోజులు కురిసిన తేలికపాటి వర్షాలకే చిత్తడిగా మారిపోయిందని చెబుతున్నారు. కనీస సేవలు అందకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:కొబ్బరికాయ కొడితే కొత్త రోడ్డుకు పగుళ్లు- ధర్నాకు దిగిన ఎమ్మెల్యే

Last Updated :Dec 4, 2021, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details