తెలంగాణ

telangana

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

By

Published : Apr 6, 2022, 9:40 PM IST

Criminal Procedure Identification Bill 2022: క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుతో వ్యక్తిగత గోప్యతకు భంగం లేదా డేటా లీక్‌లకు ఎలాంటి అవకాశం ఉండదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. నిందితుల నుంచి వేలిముద్రలు, అరచేతి ముద్రలు, కాలిముద్రలు, ఫొటోగ్రాఫ్స్‌, ఐరీస్‌, రెటీనా స్కాన్‌, ఫిజికల్‌, బయలాజికల్‌ శాంపిల్స్‌ తీసుకునేందుకు ఈ బిల్లు అనుమతించనుంది.

Amit Shah
అమిత్‌ షా

Criminal Procedure Identification Bill 2022: క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. నేరారోపణ కేసుల్లో దోషులు, ఇతరుల గుర్తింపు, దర్యాప్తు కోసం శాంపిల్స్‌ సేకరించేందుకు దర్యాప్తుసంస్థలను అనుమతించే లక్ష్యంతో ఈ బిల్లును ప్రతిపాదించారు. నేరస్థుల గుర్తింపు చట్టం-1920 స్థానంలో తెచ్చిన ఈ బిల్లును ఈనెల 4న లోక్‌సభ, ఇవాళ రాజ్యసభ ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. దర్యాప్తు ప్రక్రియను బలోపేతం చేయటం, నేర నిరూపణరేటు పెంచటం ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు.

ఈ బిల్లుతో వ్యక్తిగత గోప్యతకు భంగం లేదా డేటా లీక్‌లకు ఎలాంటి అవకాశం ఉండదని హామీ ఇచ్చారు. దర్యాప్తులో పోలీసులు, ఫోరెన్సిక్‌ బృందాల సామర్థ్యం పెంచటమే కాకుండా థర్డ్‌ డిగ్రీని తొలగిస్తుందని తెలిపారు. నిందితుల నుంచి వేలిముద్రలు, అరచేతి ముద్రలు, కాలిముద్రలు, ఫొటోగ్రాఫ్స్‌, ఐరీస్‌, రెటీనా స్కాన్‌, ఫిజికల్‌, బయలాజికల్‌ శాంపిల్స్‌ తీసుకునేందుకు ఈ బిల్లు అనుమతించనుంది. సేకరించిన డేటాను పరిరక్షించటంతోపాటు సురక్షితమైన వ్యవస్థ ద్వారా షేర్‌ చేయటం జరుగుతుందని, తద్వారా వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని అమిత్‌ షా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:గడ్కరీతో విందు.. మోదీతో భేటీ.. 'మహా'లో ఏంటీ 'పవార్' ట్విస్ట్?

ABOUT THE AUTHOR

...view details