తెలంగాణ

telangana

'కాంగ్రెస్​ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక అప్పుడే'

By

Published : Dec 30, 2021, 12:20 PM IST

Congress new president: కాంగ్రెస్​ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఇది పూర్తైన వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 2022 సెప్టెంబర్ చివరి నాటికి పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని తెలిపారు.

Congress new president
Congress new president

Congress Presidential election: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిపై ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ప్రెసిడెంట్ మధుసూదన్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. 2022 సెప్టెంబర్ చివరి నాటికి పార్టీకి నూతన అధ్యక్షుడు వస్తాడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు.

Congress next president

"ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 2022 మార్చి 1 నాటికి ఇది పూర్తవుతుంది. మార్చి తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రాథమిక స్థాయి(బ్లాక్ లెవల్) నుంచి ఎన్నికలు మొదలవుతాయి. అధ్యక్ష పదవికి ఎన్నికలు సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయి. అక్టోబర్ 1కి పార్టీకి నూతన అధ్యక్షుడు వస్తారు."

-మధుసూదన్ మిస్త్రీ, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అధ్యక్షుడు

సీడబ్ల్యూసీకి జరగాల్సిన ఎన్నికలపై వర్కింగ్ కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని మిస్త్రీ తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

సంక్షోభంలో కాంగ్రెస్..

దేశంలోని అతిపురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్.. నాయకత్వ సంక్షోభంలో ఉంది. 2019 లోక్​సభ ఎన్నికల తర్వాత పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టారు.

అయితే, పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్​లో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడిన 23 మంది సీనియర్ నేతలు.. సోనియాకు లేఖ రాశారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, పార్లమెంటరీ బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటకు పొక్కింది.

అనంతరం, పలుమార్లు సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఎన్నికలు నిర్వహించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించినప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ స్వయంగా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:'హస్త'వాసి బాగాలేదు.. దుర్బల నాయకత్వమే కాంగ్రెస్​కు గుదిబండ!

ABOUT THE AUTHOR

...view details