తెలంగాణ

telangana

'భాజపా, ఆరెస్సెస్​లతో జాగ్రత్త.. ఆ విషయంలో వెనకాడరు'

By

Published : Nov 6, 2021, 5:39 PM IST

దేశ ప్రజలను విడగొట్టేందుకు భాజపా, ఆరెస్సెస్​లు ఎంత దూరమైనా వెళ్తాయని రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ (Rakesh Tikait news today) ఆరోపించారు. వీరితో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైతులతో చర్చలు (Farmers Protest news) జరపాలని కేంద్రానికి సూచించారు.

RAKESH TIKAIT news
రాకేశ్ టికాయిత్

భాజపా, ఆరెస్సెస్​లతో (RSS BJP news) దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ (Rakesh Tikait news today) హెచ్చరించారు. ప్రజలను, వారి మధ్య ఐక్యతను విడదీసేందుకు వారు ఎంత దూరమైనా వెళ్తారని ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం (Farmers Protest news) ప్రారంభించి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో మాట్లాడిన ఆయన (Rakesh Tikait latest news).. కేంద్రం చర్చలకు వస్తే మంచిదని అన్నారు. లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని టికాయిత్ (BKU Tikait) స్పష్టం చేశారు.

"ప్రభుత్వం మాతో ఎందుకు చర్చలు జరపడం లేదు? దాదాపు ఏడాది కావొస్తోంది. ఇంత సుదీర్ఘంగా ఏ నిరసనలైనా జరగడం చూశారా? ఈ నిరసనలను ఎంత కాలం కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటోంది? చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఓ నిర్ణయానికి రండి."

-రాకేశ్ టికాయిత్, బీకేయూ ప్రతినిధి

నిరసనలు కొనసాగించేందుకు మరిన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు టికాయిత్ (Rakesh Tikait latest news) తెలిపారు. శీతకాలం వచ్చేసింది కాబట్టి చలిని తట్టుకునేలా బట్టలు తెచ్చుకోవాలని రైతులను కోరుతామని చెప్పారు.

ఇదీ చదవండి:కొరడాలతో కొట్టుకుంటూ.. దీపావళి వేడుకలు!

ABOUT THE AUTHOR

...view details