తెలంగాణ

telangana

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు మూడేళ్లు పూర్తి

By

Published : Aug 11, 2020, 6:46 AM IST

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పుస్తకం విడుదల చేయనున్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. 250 పేజీల ఈ పుస్తకం డిజిటల్‌ వెర్షన్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆవిష్కరించనున్నారు.

venkaiah naidu to complete 3 years as vice president
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు మూడేళ్లు పూర్తి

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటితో మూడేళ్లు పూర్తికానున్నాయి. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి 'కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం డిజిటల్‌ వెర్షన్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆవిష్కరించనున్నారు. 250 పేజీల ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖకు చెందిన ప్రచురణల విభాగం రూపొందించింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, ప్రయాణాలు, ఇతర ముఖ్యకార్యక్రమాలన్నింటికీ ఇందులో స్థానం కల్పించారు.

రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు చేపట్టిన సంస్కరణలతోపాటు, ఎగువ సభ కార్యకలాపాల ఉత్పాదకతను ఎలా పెంచిందీ పుస్తకంలో వివరించారు. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మిషన్‌ కనెక్ట్‌ పేరుతో ఆయన పాత స్నేహితులు, ఉపాధ్యాయులు, సుదీర్ఘ సహచరులు, బంధువులు, ఆధ్యాత్మిక గురువులు, పాత్రికేయులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్న విషయాన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. కరోనా సమయంలో ఆయన ఫోన్‌ ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఉభయ సభలకు చెందిన విభిన్న పార్టీల సభాపక్షనేతలతో కూడా మాట్లాడారు.

ఇదీ చూడండి: రాజ్యసభ హౌసింగ్​ కాంప్లెక్స్​కు వెంకయ్య శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details