తెలంగాణ

telangana

గిరిజన దేవతల దర్శనం కోసం ఛత్తీస్‌గఢ్‌లోని ఆ ఊరంతా తరలివచ్చింది

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 3:48 PM IST

Medaram Sammakka Saralamma Jatara 2024 : మేడారం సమక్క సారలమ్మ జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. గురువారం మేడారం గద్దె మీదికి చేరుకున్న సమక్క అమ్మవార్లను దర్శించకోవడానికి భక్తుల తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఆమె రాకతో భక్తుల నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగాయి. డప్పు, డోలు వాద్యాలతో అనూహ్యంగా పెరిగిన భక్తులతో మేడారంలోని ప్రధాన దారులన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి.

Huge Devotees to Medaram Sammakka Saralamma Temple : అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పొటెత్తుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామం నుంచి ఊరు ఊరంతా తరలివచ్చింది. అమ్మవారికి తొలి ధాన్యం సమర్పించడం తమ గ్రామ ఆచారమని తెలిపారు. మరోవైపు మేడారం అమ్మవార్లను గవర్నర్​ తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా కూడా దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details