తెలంగాణ

telangana

వాట్సాప్​లో 4 కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్స్​ - ప్రత్యేకతలు ఇవే!

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 10:54 AM IST

WhatsApp Text Formatting Features : వాట్సాప్ యూజర్లకు గుడ్​న్యూస్. ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్ తన యూజర్ల కోసం 4 సరికొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్లను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్​, వెబ్​తో పాటు మ్యాక్​ డెస్క్​టాప్​ల్లో ఈ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Text Formatting Features
WhatsApp Text Formatting Features

WhatsApp Text Formatting Features :ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు సహా, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా 4 టెక్ట్స్​ ఫార్మాటింగ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్​డేట్​కు సంబంధించిన వివరాలను మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన వాట్సప్‌ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అధికారిక సమాచారం పంపిచాలనుకొనే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. వాట్సాప్​ కొత్తగా తీసుకువచ్చిన ఈ ఫీచర్​ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మరింత ఆకర్షణీయంగా టెక్ట్స్
ఇప్పటి వరకు వాట్సాప్​ నుంచి ఇతరులకు ఎలాంటి సమాచారం పంపించాలన్నా సాధారణ టెక్ట్స్‌ రూపంలోనే పంపించాల్సి వస్తోంది. వాటికి మెరుగులు దిద్దాలంటే ప్రస్తుతానికి కొన్ని ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదనపు హంగులు కోసం యూజర్స్ మరో యాప్‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఇకపై అలాంటి సమస్య ఉండదు. అధికారిక సమాచారం పంపించేటప్పుడు, సుదీర్ఘ టెక్ట్స్‌ను పంపే సమయంలో ముఖ్యమైన అంశాలను నంబరింగ్‌, ఇన్‌లైన్‌ కోడ్‌, బ్లాక్‌ కోట్‌, బుల్లెట్స్‌ రూపంలోకి ఇప్పుడు చాలా సులభంగా మార్చడానికి వీలవుతుంది.

ఫార్మాటింగ్ ఫీచర్​ను ఏవిధంగా ఉపయోగించాలంటే?
మీరు పంపించాలనుకున్న టెక్ట్స్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని బుల్లెట్స్‌ రూపంలో అందించాలనుకుంటే ఆ వాక్యం ముందు '-'టైప్‌ చేయాలి. కంప్యూటర్​లో Shift + Enter ను టైప్‌ చేస్తే తర్వాత వాక్యానికి కూడా బుల్లెట్‌ పాయింట్ వచ్చేస్తుంది. ఒక వేళ మీకు నంబర్డ్‌ లిస్ట్‌ కావాలనుకుంటే టెక్ట్స్‌ ముందు '1, 2, 3'ఇలా అంకెలను టైప్‌ చేయాలి. ఇది కూడా బుల్లెట్‌ పాయింట్స్​ మాదిరిగానే పని చేస్తుంది. సుదీర్ఘమైన టెక్ట్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్లను హైలైట్‌ చేసేందుకు ఆ వాక్యాల ముందు'>' ని టైప్‌ చేయాలి. ఇదే బ్లాక్‌ కోట్‌. బ్యాక్‌గ్రౌండ్‌తో సహా వాక్యాన్ని హైలైట్‌ చేసేందుకు ఇన్‌లైన్‌ కోడ్‌ చిహ్నాల ``మధ్యన పదాలు ఉంచాలి. వాట్సప్‌ యూజర్లకోసం తీసుకొచ్చిన ఈ నాలుగు ఆప్షన్లను ఆండ్రాయిడ్‌, ఐఫోన్, వెబ్‌తో పాటు మ్యాక్‌ డెస్క్‌టాప్​లో కూడా వినియోగించుకోవచ్చు. పర్సనల్, గ్రూప్‌ చాట్‌లకే కాకుండా ఛానెల్‌ అడ్మిన్‌లు సైతం ఈ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు.

వాట్సాప్ టెక్ట్స్​ ఫార్మాటింగ్ ఫీచర్

వాట్సాప్ స్పెషల్​ హెల్ప్​లైన్​తో 'డీప్​ఫేక్స్​'కు చెక్​!

వాట్సాప్​ నయా సేఫ్టీ ఫీచర్​ - ఇకపై మీ 'ప్రొఫైల్​ పిక్'ను ఎవరూ​ స్క్రీన్​షాట్​ తీయలేరు!

ABOUT THE AUTHOR

...view details