ETV Bharat / technology

వాట్సాప్​ నయా సేఫ్టీ ఫీచర్​ - ఇకపై మీ 'ప్రొఫైల్​ పిక్'ను ఎవరూ​ స్క్రీన్​షాట్​ తీయలేరు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 5:20 PM IST

Whatsapp DP Screenshot Feature
Whatsapp DP Screenshot Feature

Whatsapp DP Screenshot : వాట్సాప్ తమ యూజర్ల కోసం మరో సేఫ్టీ ఫీచర్​ను తీసుకొస్తోంది. దీనితో మీ​ ప్రొఫైల్ పిక్​ను ఇతరులు ఎవ్వరూ స్క్రీన్​షాట్ తీయడానికి వీలుండదు. ఫలితంగా యూజర్ల ప్రైవసీకి భద్రత ఏర్పడుతుందని వాట్సాప్ చెబుతోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Whatsapp DP Screenshot : తమ వినియోగదారుల భద్రత, గోప్యత విషయంలో ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్ వాట్సాప్​ ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో పలు కీలక అప్డేట్​లు, ఫీచర్లను వాట్సాప్​ అప్లికేషన్​లో తీసుకువచ్చింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్​ను తెచ్చేందుకు సిద్ధమయింది వాట్సాప్​. త్వరలో రానున్న ఈ నయా ఫీచర్​ దాదాపు చాలామందికి వ్యక్తిగత భద్రతతో పాటు అనేక విధాలుగా ఉపయోగపడనుంది. ఇంతకీ ఆ కొత్త ఫీచర్​ ఏంటంటే?

'స్క్రీన్​షాట్ బ్లాక్​' ఫీచర్​
Whatsapp New Features 2024 : వాట్సాప్​ యూజర్స్​ తమ వాట్సాప్​ అకౌంట్​లో డీపీ లేదా ప్రొఫైల్​ పిక్​ పెట్టుకుంటారు. చాలా వరకు అది తమ సెల్ఫీ లేదా రెగ్యులర్​ ఫొటో అయ్యుంటుంది. దీనిని ఇతరులు స్క్రీన్​షాట్ తీసి, తప్పుడు పనులకు వాడుకోవచ్చు. అందుకే ఇకపై యూజర్​ ప్రొఫైల్​ పిక్​ను, ఇతరులు స్క్రీన్​షాట్​ తీయడానికి వీలులేకుండా ఓ నయా ఫీచర్​ను తీసుకువస్తోంది వాట్సాప్​. కప్రస్తుతం ఈ ఫీచర్​ను బీటా టెస్టర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. టెస్టింగ్ పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా సాధారణ వినియోగదారులు అందరికీ దీనిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్​ వచ్చిన తర్వాత ఎవరైనా మీ డీపీని స్క్రీన్​షాట్​ తీసుకునేందుకు ప్రయత్నిస్తే 'Can't Take A Screenshot Due To App Restrictions' అనే సందేశం వస్తుంది. వాస్తవానికి ఇలాంటి వార్నింగ్​ మెసేజ్​లు ఇప్పటికే స్నాప్​చాట్​, పేటీఎం, గూగుల్​ పే లాంటి ఇతర యాప్స్​లో కనిపిస్తుంటాయి.

శతకోటి ఉపాయాలకు అనంత కోటి --
వాట్సాప్​ తేనున్న ఈ డీపీ స్క్రీన్​షాట్ బ్లాక్ ఫీచర్​తో, ప్రొఫైల్ పిక్చర్​లను స్క్రీన్​షాట్ అయితే తీయలేరు. కానీ మరో సెల్​ఫోన్​ లేదా కెమెరా ఉపయోగించి వాట్సాప్ డీపీని ఫొటో తీసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే అంతకుముందు వాట్సాప్​లో ప్రొఫైల్​ పిక్​ను డౌన్​లోడ్​ చేసుకునే ఆప్షన్​ ఉండేది. అయితే ఆ ఫీచర్​ను 2019లోనే తొలగించింది వాట్సాప్​.

అమ్మాయిలకు ఇబ్బందే!
కొంత మంది అమ్మాయిలు తమ ఫొటోలను లేదా సెల్ఫీలను వాట్సాప్​ ప్రొఫైల్​ పిక్​ లేదా డిస్​ప్లే పిక్చర్​(డీపీ)గా పెట్టుకుంటారు. అయితే అలా పెట్టుకున్న ఫొటోస్​ను, గిట్టనివారు లేదా సైబర్ నేరగాళ్లు ఎవరైనా స్క్రీన్​షాట్​ తీసి, వివిధ రకాల ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో మార్ఫింగ్​, డీప్​ఫేక్ టెక్నాలజీస్ ఉపయోగించి, సైబర్ నేరగాళ్లు అమాయకులను తీవ్రమైన మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరికొందరు దుండగులు తమకు నచ్చనివారి ఫొటోలను అసభ్యకరమైన రీతిలో తయారు చేసి, వాటిని సోషల్​ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని నివారించడానికే వాట్సాప్​ ఈ 'ప్రొఫైల్​ పిక్​- నో స్క్రీన్​షాట్​' ఫీచర్​ను అందుబాటులోకి తెస్తోంది.

రూ.3000 బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్​ కొనాలా? టాప్​-9 ఆప్షన్స్ ఇవే!

రూ.10 వేలలోపు సూపర్​ ఫీచర్స్​తో స్మార్ట్​ ఫోన్​ కొనాలా? బెస్ట్​ ఆప్షన్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.