తెలంగాణ

telangana

చెరకు సాగు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ప్రారంభం ఒకేసారి : శ్రీధర్‌ బాబు

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 7:28 PM IST

Minister Sridhar Babu Visited Nizam Sugar Factory : నిజాం చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని శ్రీధర్‌బాబు తెలిపారు. చక్కెర పరిశ్రమ ప్రారంభం, చెరకు సాగు ఒకేసారి జరగాలని పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిఫార్సుల కమిటీ సందర్శించింది. ఛైర్మన్ శ్రీధర్‌ బాబు, సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Nizam Sugar Factory at Bodhan
Minister Sridhar Babu Visited Nizam Sugar Factory

Minister Sridhar Babu Visited Nizam Sugar Factory :ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్​లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి రైతులకు అన్యాయం చేసే వాళ్లను వదిలి పెట్టమని హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిఫార్సుల కమిటీ సందర్శించింది. ఛైర్మన్ శ్రీధర్‌ బాబు, సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

పాతికేళ్ల నుంచి ఒకలెక్క - రెండున్నరేళ్ల నుంచి ఒకలెక్క - భూములు అమ్ముకునేందుకు నిజాం చక్కెర కర్మాగార రైతుల అగచాట్లు

Nizam Sugar Factory at Bodhan: చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని శ్రీధర్‌ బాబు తెలిపారు. చక్కెర పరిశ్రమప్రారంభం, చెరకు సాగు ఒకేసారి జరగాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమ పునరుద్ధరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. లాభాల్లో ఉండే విధంగా ఫ్యాక్టరీని (Nizam Sugar Factory) తిరిగి తెరిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. గతంలో బీఆర్ఎస్ నిర్ణయాల వల్ల చెరకు రైతులు నష్టపోయారని విమర్శించారు. చెరకు రైతులకు పర్చేస్‌ ట్యాక్స్‌, సబ్సిడీని పరిశీలిస్తున్నామని, ట్రాన్స్‌ పోర్టు సబ్సిడీ, కొత్త వంగడాలపై దృష్టి సారించామని తెలిపారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను నిర్దేశించిన సమయంలో అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

Minister Sridhar Babu On congress Scams :ఈ నెల 27న మరో రెండు హామీలైన 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500 కే సిలిండర్​ను ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రైతు బంధు విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, గుట్టలకు ఇస్తున్నారనే విషయం పరిశీలనలో ఉందని చెప్పారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను నిర్దేశించిన సమయంలో అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. కొన్ని రోజుల్లో ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్​ను ప్రారంభిస్తాము. దీనికి నిజాం షుగర్ ప్యాక్టరీ ఒక ఉదాహరణ. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్​ ఫ్యాక్టరీని తెరిపించడానికి మేము కట్టుబడి ఉన్నాం. షుగర్​ ఫ్యాక్టరీని తెరిపించమే మా ప్రభుత్వ లక్షం. ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లకి గేట్లు బంద్​ చేస్తాం. ప్రజలకు పనిచేయాలనే నాయకులకు ఎప్పుడైనా మేము సహాయం చేయడానికి రెడీగా ఉంటాం".-శ్రీధర్ బాబు, మంత్రి

చెరకు సాగు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ప్రారంభం ఒకేసారి : శ్రీధర్‌ బాబు

నిజాం షుగర్స్​పై ప్రభుత్వం ఫోకస్- ఫ్యాక్టరీకి పూర్వవైభవం వచ్చేనా?

నిజాం షుగర్స్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - హాజరైన మంత్రులు శ్రీధర్​ బాబు, దామోదర

ABOUT THE AUTHOR

...view details