తెలంగాణ

telangana

తన భూమి తనకు కాకుండా చేశారని తుపాకీతో బెదిరింపులు - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - Man With Gun Arrested

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 4:37 PM IST

Man With Gun Arrested in Peddapalli District : తుపాకీతో బెదిరించి భూ ఆక్రమణకు పాల్పడిన ఓ వ్యక్తిని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని ఊషన్నపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. తన భూమిని ఆక్రమంగా దోచుకున్నారని కక్ష పెంచుకున్న నిందితుడు ఆగ్రకు వెళ్లి తుపాకీ కొనుగోలు చేసి మరి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Man With Gun Arrested
Man With Gun Arrested in Peddapalli District

Man With Gun Arrested in Peddapalli District :తుపాకీతో బెదిరించి భూ ఆక్రమణకు పాల్పడిన ఓ వ్యక్తిని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలోని ఊషన్నపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముస్కు రామయ్యకు వాళ్ల తాతల కాలం నాటి నుంచి వచ్చిన 5 ఎకరాల భూమి ఉంది. అయితే తన పేరుపైకి స్థలం ఎలా మార్పించుకోవాలో తెలియదు. రెవెన్యూ రికార్డులో తన పేరుపై ఎలా ఎక్కించుకోవాలో తెలియలేదు. ఈ క్రమంలోనే తన పొలం పక్కనే ఉన్న మల్లారెడ్డి, రామయ్య భూమిని తన పేరుపై రెవెన్యూ రికార్టుల్లో ఎక్కించుకున్నాడు. ఆ 5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన భూమి కోసం ఎక్కడికి పోయి అడిగినా గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారులు రామయ్య పేరు రికార్డు లేదని ఎలాంటి పరిష్కారం చూపలేమన్నారు.

మంచిర్యాలలో అత్తమామలపై అల్లుడి కాల్పులు

Land Fights in Peddapalli District : దాంతో తనకు భూమి దక్కదు అనే ఉద్దేశంతో పక్క గ్రామంలో ఇటుకల బట్టీలో పని చేయడానికి వెళ్లాడు. అందులో పని చేస్తున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వారితో స్నేహం ఏర్పరుచుకున్నాడు. వారి ద్వారా యూపీలో సులభంగా తుపాకీ దొరుకుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఉత్తర్​ప్రదేశ్​కు వెళ్లి తుపాకీ తెచ్చుకున్నాడు. మల్లారెడ్డి, లేదా ఆయన కుమారుడిని చంపితే తనకు తన భూమి వస్తుందన్న ఆలోచనతో ఈ పనికి ఒడిగట్టాడు. తుపాకీ కోసం తోటి కార్మికుడితో కలిసి ఉత్తర్​ప్రదేశ్ వెళ్లాడు. మొదటిసారి, రెండోసారి ఆయనకు తుపాకీ అమ్మేవారు దొరకలేదు. అదే పని మీద ఆగ్రా, కాన్పూర్ ప్రాంతాల్లో తిరిగాడు. తర్వాత ఆగ్రాలో దొరుకుతుందని తెలిసి, మళ్లీ అక్కడికి వెళ్లి తుపాకీ కొనుగోలు చేశాడు.

ఫ్యాక్టరీ మేనేజర్​పై పొరుగింటి వ్యక్తి కాల్పులు- ఆ గొడవ వల్లే!

తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన నిందితుడు రామయ్య, ఇటీవల భూ యజమాని మల్లారెడ్డిపై కాల్పులు జరిపాడు. కాల్పుల నుంచి తప్పించుకున్న మల్లారెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు తెలియజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడు రామయ్య వద్ద ఒక తుపాకీ, రెండు కాల్చిన తూటాలు, మరో నాలుగు తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ చెప్పారు. కాల్పులు జరిపిన రామయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు రివార్డు అందజేశారు. అక్రమ ఆయుధాలతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.

భూమి కోసం తుపాకీతో బెదిరింపులు ఆగ్రాకు వెళ్లి మరీ కొనుగోలు

అత్యాచార బాధితురాలిపై నిందితుడి కాల్పులు- పారిపోతుండగా ఢీకొట్టిన రైలు- కాలు కట్​!

ABOUT THE AUTHOR

...view details