ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో హింస- నలుగురు మృతి, 300 మందికిపైగా గాయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 7:23 AM IST

Updated : Feb 9, 2024, 10:56 AM IST

Haldwani Violence Today : ఉత్తరాఖండ్‌లో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మదర్సా, మసీదును కూల్చేస్తున్న మున్సిపల్​ కార్మికులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఆందోళనకారులు మరణించారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో 300 మందికిపైగా గాయపడ్డారు.

Haldwani Violence Today
Haldwani Violence Today

Haldwani Violence Today : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఆరుగురు ఆందోళనకారులు మరణించారు. మరో 300 మంది గాయపడ్డారు. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్​ కార్మికులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు సహా నలుగురు ఆందోళనకారులు మరణించగా, రాళ్ల దాడిలో 300 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హల్ద్వానీలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
Illegal Mazars In Uttarakhand : నగరంలోని బన్‌భూల్‌పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సాతోపాటు మసీదును నిర్మించారు. వాటిని తొలగించాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీంతో గురువారం ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేతకు సిద్ధమయ్యారు. వారిని స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు. అయినప్పటికీ అధికారులు బుల్డోజరుతో మదర్సాను కూల్చివేయించారు. దీంతో ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వడమే కాకుండా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. వనభూల్‌పురా పోలీస్‌ స్టేషన్‌ను తగులబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు జారీ చేశారు.

సీఎం రియాక్షన్​
CM Reaction On Uttarakhand Haldwani Violence : ఇదిలాఉండగా ఈ ఘటనపై ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్​ ధామీ స్పందించారు. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలను సహించబోమని, ఘటన వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు హింస తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలను నిలిపివేశారు అధికారులు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

పార్లమెంట్​ ముట్టడికి రైతుల పిలుపు​- దిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్​ జామ్​

ఫేస్‌బుక్ లైవ్‌లోనే కాల్పులు- శివసేన నేత మృతి, ఫడణవీస్ రాజీనామాకు డిమాండ్

Last Updated :Feb 9, 2024, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.