తెలంగాణ

telangana

'గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన పార్టీ బీఆర్ఎస్ - ఇంకా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తిరుగుబాటు తప్పదు'

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 7:23 PM IST

Updated : Jan 26, 2024, 7:30 PM IST

Bandi Sanjay Fires on BRS Leaders : గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన పార్టీ బీఆర్ఎస్ అని, అందువల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. ఒక మహిళా గవర్నర్​ పర్యటనలకు ప్రొటోకాల్ పాటించనీయకుండా అధికారులను అడ్డుకున్న భారత రాష్ట్ర సమితి నాయకులు, ఇప్పుడు గవర్నర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే అధికారం కోల్పోయాక కూడా ఇంకా గూండా గిరీ చేస్తాం, ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.

Bandi Sanjay
Bandi Sanjay Fires on BRS Leaders

'గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన పార్టీ బీఆర్ఎస్ - ఇంకా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తిరుగుబాటు తప్పదు'

Bandi Sanjay Fires on BRS Leaders : గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అని, అందువల్లే ప్రజలు ఆ పార్టీని రద్దు చేశారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. ఒక మహిళా గవర్నర్​ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా, గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ పాటించనీయకుండా అధికారులను అడ్డుకున్న భారత రాష్ట్ర సమితి నాయకులు, ఇప్పుడు గవర్నర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించినా, అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని దుయ్యబట్టారు.

గవర్నర్ అంటే రబ్బర్ స్టాంపులా ఉండాలనుకుంటున్నారని, రాజ్యాంగానికి లోబడి పని చేసే వాళ్లు వాళ్లకు పనికిరారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్నే మార్చాలని అంబేడ్కర్​ను అవమానించింది కేసీఆర్‌ కుటుంబమని దుయ్యబట్టారు. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్న దృష్ట్యా ఆయన కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే బీఆర్​ఎస్​ నేతలపై విరుచుకుపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కేసీఆర్​, కేటీఆర్​ జైలుకి వెళ్లేవారు : బండి సంజయ్​

గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్. అందువల్లే ప్రజలు ఆ పార్టీని రద్దు చేశారు. ఒక మహిళా గవర్నర్​ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా, గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ పాటించనీయకుండా అధికారులను అడ్డుకున్న నాయకులు, ఇప్పుడు గవర్నర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించినా, అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. - బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యదర్శి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ది మూడో స్థానమేనని బండి సంజయ్ జోస్యం చెప్పారు. అధికారం కోల్పోయాక కూడా ఇంకా గూండా గిరి చేస్తాం, ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. వచ్చే నెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రామాల వారీగా పాదయాత్ర చేపట్టి, 20 రోజుల్లో అన్ని మండలాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చిందో పంచాయతీల వారీగా వివరిస్తానని బండి సంజయ్ వివరించారు. అంతకు ముందు సరదాగా పిల్లలతో క్రికెట్‌ ఆడారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు : బండి సంజయ్

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ది మూడో స్థానమే. వచ్చే నెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రామాల వారీగా పాదయాత్ర చేపడతా. 20 రోజుల్లో అన్ని మండలాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చిందో పంచాయతీల వారీగా వివరిస్తా. - బండి సంజయ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్రయత్నాలు - లోక్​సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు : బండి సంజయ్

Last Updated :Jan 26, 2024, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details