తెలంగాణ

telangana

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు - రాణిస్తున్న బ్యాంకింగ్, టెక్ సెక్టార్లు!

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 9:58 AM IST

Updated : Mar 12, 2024, 10:29 AM IST

Stock Market Today March 12th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

Share Market Close Today March 12th 2024
Stock Market Close Today March 12th 2024

Stock Market Today March 12th 2024 :మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, టెక్ సెక్టార్లు రాణిస్తుండడం సహా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలపరుస్తోంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 388 పాయింట్లు లాభపడి 73,891 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 85 పాయింట్లు వృద్ధి చెంది 22,418 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇన్ఫోసిస్​​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, టెక్ మహీంద్రా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :ఐటీసీ, నెస్లే ఇండియా, ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, ఎస్​బీఐ

Indigo Shares :
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ 'ఇండిగో' సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన రాకేశ్​ గంగ్వాల్, కంపెనీలోని తన షేర్​ హోల్డింగ్​ను భారీగా తగ్గించుకున్నారు. సోమవారం 5.83 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో అమ్మేశారు. దీని మొత్తం విలువ సుమారుగా రూ.6,785 కోట్లు ఉంటుంది.

విభేదాలే కారణం!
ఇండిగో కార్పొరేట్ గవర్నెన్స్​ విషయంలో సహ వ్యవస్థాపకుడు రాహుల్​ భాటియాతో రాకేశ్​ గంగ్వాల్​కు విభేదాలు వచ్చాయి. దీనితో కంపెనీలోని తన షేర్ హోల్డింగ్స్​ను తగ్గించుకుంటానని ఫిబ్రవరిలోనే రాకేశ్ గంగ్వాల్ ప్రకటించారు.

బీఎస్​ఈ బల్క్​ డీల్​ డేటా ప్రకారం, రాకేశ్ గంగ్వాల్​ 2.25 కోట్ల షేర్లను మూడు విడతలుగా విక్రయించారు. వీటిని రూ.3,015.10 నుంచి రూ.3,016.36 ప్రైస్​ రేంజ్​లో అమ్మేశారు. వాస్తవానికి ఈ ఇండిగో షేర్ వాల్యూ బీఎస్​ఈలో రూ.3,214.25గా ఉంది. కానీ రాకేశ్​ వాటిని డిస్కౌంట్ ప్రైస్​లోనే అమ్మేయడం గమనార్హం.

రూపాయి విలువ
Rupee Open March March 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.76గా ఉంది.

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో హాంకాంగ్​, సియోల్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టోక్యో, షాంఘై మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు మిక్స్​డ్ నోట్​తో ముగిశాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,212 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధర
Crude Oil Prices March 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.35 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.50 డాలర్లుగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

PPF, SSY ఖాతాదారులకు అలర్ట్​ - కనీస మొత్తం జమ చేయడానికి డైడ్​లైన్​ ఇదే!

Last Updated :Mar 12, 2024, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details