తెలంగాణ

telangana

ఎల్​ఐసీ నయా ప్లాన్​తో డబుల్ బెనిఫిట్స్​ - జీవిత బీమా + సంపద వృద్ధి!

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 3:56 PM IST

LIC New Index Plus Plan Details : ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ తమ ఇన్వెస్టర్ల కోసం సరికొత్త పాలసీని తీసుకువచ్చింది. దీని ద్వారా జీవిత బీమాతో పాటు, ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్​ను కూడా ఇస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ నయా ఎల్​ఐసీ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

lic index plus plan benefits
lic index plus plan details

LIC New Index Plus Plan Details : ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కొత్తగా 'ఇండెక్స్ ప్లస్ ప్లాన్'ను ప్రవేశపెట్టింది. ఇది క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడానికి ఇష్టపడే వారికోసం రూపొందించిన కొత్త పెట్టుబడి అవకాశం. ఇండెక్స్ ప్లస్ ప్లాన్ రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుందని ఎల్ఐసీ తెలియజేస్తుంది. మొదటిది జీవిత బీమా కవరేజీని అందించడం, రెండవది పాలసీ గడువు వరకు పొదుపు చేసే అవకాశం కల్పించడం.

ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ ప్లాన్​ ఎలిజిబిలిటీ :
బీమా పథకంలో చేరాలనుకునే వారి వయసు కనిష్ఠంగా 90 రోజులు, గరిష్టంగా 60 సంవత్సరాలలోపు ఉండాలి. ఒక వేళ మీ వయసు 90 రోజుల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే, మీ వార్షిక ప్రీమియానికి 7 నుంచి 10 రేట్లు వరకు బేసిక్ సమ్ అస్యూర్డ్ లభిస్తుంది. ఒకవేళ మీ వయసు 51 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటే, మీకు లభించే బేసిక్ సమ్ అస్యూర్డ్ మీ వార్షిక ప్రీమియానికి 7 రెట్లు ఉంటుంది.

ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ప్రీమియం :
ఈ ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీలో మీకు నచ్చిన కాలవ్యవధుల్లో ప్రీమియం చెల్లించవచ్చు. అంటే నెల, 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సర కాల వ్యవధుల్లో ప్రీమియం చెల్లించవచ్చు. ఒక వ్యక్తి సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించాలని అనుకుంటే, కనిష్ఠంగా ఏటా రూ.30,000 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఆరు నెలలకు రూ.15,000, మూడు నెలలకు రూ.7,500 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ చెల్లింపులను ఎంచుకుంటే నెలకు రూ.2,500 చొప్పున చెల్లించాలి. గరిష్ఠ ప్రీమియంపై ఎలాంటి పరిమితిలు లేవు.

ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ ప్లాన్ లాక్ ఇన్ పీరియడ్
ఎల్ఐసీ నిబంధనల ప్రకారం కనీసం ఐదేళ్ల పాటు లాక్​ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 ఏళ్ల తరువాత పాలసీలో కొంత భాగాన్ని షరతులతో వెనక్కు తీసుకోవచ్చు. గ్యారంటీ ఆడిషన్​గా వార్షిక ఛార్జీల్లో కొంత శాతాన్ని యూనిట్ ఫండ్​కు జమ చేస్తారు. అయితే పాలసీ నిర్ణీత కాలం అమలులో ఉండి, ఆక్టివ్​గా ఉన్న తరువాతనే ఇది జరుగుతుంది.

మెచ్యూరిటీ అమౌంట్
ఒక వ్యక్తి ఎల్ఐసీ బీమా పాలసీ తీసుకుని పాలసీ మెచ్యూరిటీ తేదీ వరకు జీవించి ఉంటే, ఆ సమయంలో యూనిట్ ఫండ్ విలువకు సమానమైన మొత్తాన్ని ఏకమొత్తంగా పాలసీదారుకు అందిస్తారు. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, అతని/ ఆమె కుటుంబానికి పరిహారం అందిస్తారు. ఈ పాలసీలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, పాలసీదారుని మోర్టాలిటీ ఛార్జీలను కూడా రీయంబర్స్​మెంట్ చేస్తారు. మీరు ఈ పాలసీకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడరును కూడా జత చేసుకోవచ్చు..

వేగంగా సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ 8 టిప్స్​ పాటించండి!

సరైన ఇన్సూరెన్స్ ఏజెంట్​ను ఎంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

ABOUT THE AUTHOR

...view details