తెలంగాణ

telangana

నిందితుడిపై రివెంజ్​- 8నెలల గర్భిణీపై గ్యాంగ్​రేప్​, పెట్రోల్ పోసి నిప్పు

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 8:40 PM IST

Updated : Feb 18, 2024, 6:27 AM IST

Pregnant Woman Gang Raped : 8నెలల గర్భిణీని గ్యాంగ్ రేప్ చేశారు ఆరుగురు వ్యక్తులు. తర్వాత ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Pregnant Woman Gang Raped
Pregnant Woman Gang Raped

Pregnant Woman Gang Raped :ఎనిమిది నెలల గర్భిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. అనంతరం ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాధితురాలికి 70 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణం మధ్యప్రదేశ్​లోని మొరెనా జిల్లాలో జరిగింది.

అసలేం జరిగిందంటే?
అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహిళపై ఓ వ్యక్తి కొన్నాళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 10 రోజుల క్రితం నిందితుడు బెయిల్​పై విడుదలయ్యాడు. అయితే బాధితురాలితో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో బాధితురాలి గ్రామానికి చెందిన కొందరు, నిందితుడి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే నిందితుడి భార్యపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందులో ఆమె భర్త సైతం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు మహిళ, ఆమె భర్తను కాపాడారు. మొరెనా జిల్లా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం గర్బిణీని గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు.

మరో కేసులో రాజీ గురించి మాట్లాడడానికి వచ్చిన ఆరుగురికి పైగా వ్యక్తులు తన భార్యపై గ్యాంగ్​ రేప్​నకు పాల్పడ్డారని గర్బిణీ భర్త ఆరోపించాడు. కాగా, గర్భిణీ భర్తకు వేరే మహిళకు గత 3ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తనను పెళ్లి చేసుకోమనడం వల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగి నిందితుడిపై కేసు పెట్టినట్లు సమాచారం.

"ఘటనాస్థలిలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అక్కడ ఒక లెటర్ స్వాధీనం చేసుకున్నాం. మహిళకు 40 శాతం గాయాలయ్యాయి. ఆమెను మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్‌ మెడికల్ కాలేజీకి తరలించారు. రెండు వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి. గర్భిణి భర్త 10 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటాం." అని మొరెనా ఏఎస్పీ అరవింద్ ఠాకుర్ తెలిపారు.

పిల్లలకు నిప్పంటించిన తండ్రి
బిహార్​లోని కటిహార్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు నిప్పంటించాడు. అనంతరం తానూ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. గ్రూప్​ లోన్ తీసుకుని భార్య పరారవ్వడం వల్ల తీవ్ర ఒత్తిడితో మనస్తాపానికి గురై ఇలా పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

యువకుడు ఆత్మహత్య
సిలిండర్ పేలుడు ఘటనలో తన నలుగురు కుటుంబ సభ్యులు మరణించడం వల్ల మనస్తాపానికి గురైన 17 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఒడిశా బలంగీర్​ జిల్లాలోని కానూత్ గ్రామంలో జరిగింది. మృతుడిని ద్రోణగా పోలీసులు గుర్తించారు.

ఫ్రెండ్​తో వెళ్లిన బాలికపై గ్యాంగ్​రేప్​- నిందితులకు 90ఏళ్ల జైలుశిక్ష

12 ఏళ్ల బాలికపై 66 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం- షూటింగ్​కు వచ్చిన మోడల్​పై రేప్​

Last Updated :Feb 18, 2024, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details