Gold Smuggling: గోల్డ్​ స్మగ్లింగ్​ ఇలా కూడా చేయొచ్చు..!

By

Published : Apr 25, 2023, 7:40 PM IST

thumbnail

Rs 59 Lakhs Gold Seized At Shamshabad Airport: అక్రమ బంగారం రవాణాకు కేరాఫ్​ అడ్రస్​గా హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయం మారుతోంది. ఎందుకంటే అత్యధికంగా గోల్డ్​ను ఇక్కడికే తరలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిసినా సరే.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోని మరి నగరంలోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఎయిర్​పోర్టులో దాదాపు కిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ.. ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్​ అధికారులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్​ నుంచి ఉదయం ఒక ప్రయాణికుడు, సాయంత్రం ఒక మహిళా ప్రయాణికురాలు శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు వచ్చారు. ఇరువురిపై కస్టమ్స్​ అధికారులకు అనుమానం వచ్చి.. వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీనితో వారి వద్ద ఉన్న వివిధ వస్తువుల్లో రూ. 59.27 లక్షల విలువైన 953 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు గుర్తించారు. వాటిని చూసిన ఎయిర్​ పోర్టు అధికారులే ఆశ్చర్యానికి గురైయ్యారు. ఎందుకంటే ఎయిర్​ పాడ్స్​, పిల్లల బట్టల గుండీలు, అట్టపెట్టె మధ్యలో, పర్​ఫ్యూమ్​ బాటిల్స్​ మూతల్లో, లేడీస్​ హ్యాండ్​ బ్యాగ్​ వంటి వస్తువుల్లో ఎవరికి అనుమానం రాకుండా బంగారాన్ని దాచుకొని తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.