రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నా మా పార్టీకి గుర్తు ఎందుకు ఇవ్వలేదు : కేఏ పాల్
KA Paul on Praja Shanti Party Symbol in Telangana : రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నా తమ పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. తమ పార్టీకి గుర్తు కేటాయించకపోవడాన్ని.. అధికార పార్టీ కుట్రగా అభివర్ణించిన ఆయన.. రెండు రోజుల్లో గుర్తు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లు వేయొద్దని సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసిన కేఏ పాల్.. తమ పార్టీకి గుర్తు కేటాయించాలని కోరారు.
Symbols For Political Parties in Telangana : రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గుర్తుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ విడుదల చేశారు. 32 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేనకి గ్లాస్ టంబ్లర్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఫుట్‌బాల్ గుర్తు కేటాయించారు. ఇటీవల ఆ పార్టీకి.... బైనాక్యులర్స్ గుర్తు కేటాయించగా ఆ పార్టీ అభ్యంతరం తెలపడంతో.. తాజాగా పుట్‌బాల్ గుర్తు కేటాయించారు. యుగతులసి పార్టీకి రోడ్ రోలర్, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీకి చపాతి రోలర్ ఇచ్చారు.
తెలంగాణ రిపబ్లికన్ పార్టీకి మైక్, 10 స్థానాల్లో పోటీ చేసుకున్న సీపీఐ (ఎమ్ఎల్)కి మూడు చుక్కలు కలిగిన జెండా గుర్తు కేటాయించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐకి కంకికొడవలి, ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్‌కు సింహం ఇచ్చారు. పలు గుర్తింపు పొందిన పార్టీల గుర్తుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రజా శాంతి పార్టీకి ఏ గుర్తు కేటాయించకపోవడంతో కేఏ పాల్ అసహనం వ్యక్తం చేశారు.