Food Festival At Banjara Hills : భోజన ప్రియులను రా.. రమ్మంటున్న 'ఓరీస్ ఉప్పు తెలుగు కిచెన్'
Published: May 19, 2023, 12:21 PM

Food Festival At Banjara Hills : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓరీస్ ఉప్పు తెలుగు కిచెన్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ భాగ్యనగర భోజన ప్రియులను రా రమ్మంటూ ఆహ్వానిస్తోంది. తెలంగాణ నాటు కోడి, రాయలసీమ రాగి ముద్ద, కోనసీమ రొయ్యల వేపుడు, కోడి పులుసు రుచులు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. తెలంగాణ, రాయలసీమ, కోనసీమ ఆహారపు రుచులను భాగ్యనగర వాసులకు అందించేందుకు ఓరీస్ ఉప్పు తెలుగు కిచెన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది.
ఇందులో అసలైన తెలంగాణ, కోనసీమ, రాయలసీమ వంటకాలైనా గోంగూర మటన్, రొయ్యల వేపుడు, కోడి పులుసు, నాటు కోడి ఫ్రై.. ఇలా విభిన్న రకాలైన రుచులు అందిస్తున్నట్లు ఓరీస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ ఓరీస్ తెలిపారు. వీటితో పాటు ఐస్‌క్రీమ్‌తో బెల్లం పాకం, పాల జున్ను, బెల్లం ఐస్‌క్రీమ్, కుల్ఫీ డెజర్ట్‌లు, వెజిటేరియన్ థాలీ, రాజమండ్రి నాన్-వెజిటేరియన్ థాలీ సైతం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.